పద్మావ‌త్ 100 రోజుల వైభ‌వం

Last Updated on by

ఒక రాణి వైభవం.. ఒక రాణి వీర‌త్వ ం .. ఒక మ‌హారాణి అసాధార‌ణ జైత్ర యాత్ర‌.. 50 రోజులు కాదు.. 100 రోజులు దిగ్విజ‌యంగా పూర్త‌యింది. అస‌లు పురుషాధిక్య సినీప‌ర‌శ్ర‌మ‌లో ఒక నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా 100 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే గొప్ప అనుకుంటే అది ఏకంగా 600 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఇప్ప‌టికీ కొన్ని థియేట‌ర్ల‌లో దిగ్విజ‌యంగా ఆడుతోంది.
ది గ్రేట్ `ప‌ద్మావ‌త్ 3డి` సాధించిన అసాధార‌ణ విజ‌య‌మిది. ఈ సినిమా 100 రోజులు ఆడిన సంద‌ర్భ ంగా వ‌యాకామ్ 18 మూవీస్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. ర‌ణ‌వీర్ సింగ్‌, దీపిక ప‌దుకొన్‌, షాహిద్ క‌పూర్ పాత్ర‌ల్ని ముఖ‌చిత్రాలుగా ఎలివేట్ చేస్తూ వేసిన‌ పోస్ట‌ర్ అంత‌ర్జాలంలో ఆక‌ట్టుకుంటోంది. రాణీ ప‌ద్మినిగా దీపిక‌, మ‌హారావ‌ల్ రాణాగా షాహిద్‌, ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించారు.

User Comments