సీసీసీకి రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన అమ‌ర‌రాజా

అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై కుమారుడు అశోక్ గ‌ల్లా ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తోన్న ప‌ద్మావ‌తి గ‌ల్లా బుధ‌వారం క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ నిత్యావ‌స‌రాల‌ను కొనుగోలు చేయ‌లేని స్థితిలో ఉన్న పేద సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి ఎంతోమంది సినీ పెద్ద‌లు ముందుకు రావ‌డం శుభ ప‌రిణామ‌మ‌నీ, ఆ మంచి ప‌నిలో భాగం కావాల‌నే ఉద్దేశంతో సీసీసీకి త‌మ వంతుగా రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేస్తున్నామ‌నీ ప‌ద్మావ‌తి తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో అంద‌రూ స‌మ‌ష్టిగా కృషి చేయాల‌నీ, త‌మ త‌మ ఇళ్ల‌ల్లో ఉండ‌టం ద్వారా క్షేమంగా ఉండాల‌నీ ఆమె కోరారు. అశోక్ గ‌ల్లాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తాము నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా నిలిచిపోయింద‌నీ, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక షూటింగ్ కొన‌సాగిస్తామ‌నీ ఆమె చెప్పారు.