బూతు..ఓవ‌రాక్ష‌న్ అందుకే బ్యాన్‌

Last Updated on by

సినిమాల్లో బూతు కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉంటుంది. అయితే మ‌న సెన్సార్ వాళ్ల‌తో పోలిస్తే, పాకిస్తాన్ సీబీఎఫ్‌సీలో ఛాంద‌స‌వాదం బ‌లంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. బుర్ఖా ల్యాండ్‌లో ప్ర‌తిదీ రుద్దిరుద్ది చూస్తారు. రంధ్రాన్వేష‌ణ చేస్తారు. అందునా భార‌త‌దేశ సినిమా పాకిస్తాన్‌లో రిలీజ‌వుతోంది అంటే స‌వాల‌క్ష ఆంక్ష‌లు త‌ప్ప‌నిస‌రి. ఆ క్ర‌మంలోనే ప‌లు భార‌తీయ చిత్రాలు పాక్‌లో రిలీజ్‌కి నోచుకోలేదు.
తాజాగా అదే కేట‌గిరీలో చేరిపోయింది -వీరే ది వెడ్డింగ్‌. పెళ్లి త‌ర‌వాత అంద‌గ‌త్తెల‌ సిమ‌సిమ‌లు! అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెర‌కెక్కింది. పెళ్ల‌యితే మ‌గువ‌ల‌కు స్వేచ్ఛ ఉండ‌కూడ‌దా?  స్వేచ్ఛ అప‌హ‌ర‌ణం ఎందుకు? అనే పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. అంతా ఆడాళ్ల గుంపు క‌లిసి నిర్మించిన ఈ సినిమాలో పాయింట్ కూడా నాయికా ప్రాధాన్యం కావ‌డంతో ఇంకేం ఉంది? క‌థానాయిక‌లు అంతే చెల‌రేగిపోయి న‌టించేశారు. లేడీ నిర్మాత‌లు రియాక‌పూర్‌, ఏక్తాక‌పూర్ చెల‌రేగిపోయి పెట్టుబ‌డులు పెడితే, ఆ పెట్టుబ‌డిని తిరిగి తెచ్చేందుకు కరీనాక‌పూర్‌, సోన‌మ్ క‌పూర్‌, స్వ‌రాభాస్క‌ర్ లాంటి తార‌లు అంతే రెచ్చిపోయి న‌టించారు. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ వీక్షించ‌గానే వామ్మోవ్‌! ఇది `ఏ-గ్రేడ్‌` సినిమా అని అంతా ఎగ్జ‌యిటైపోయారు. ఇందులో డ‌బుల్ మీనింగ్ జోకులు, ద్వంద్వార్థ సంభాష‌ణ‌లు, స‌న్నివేశాల‌కు కొద‌వేం లేదు. మ‌రో కోణంలో చూస్తే ఇదో `డ‌ర్టీపిక్చ‌ర్ 2` అనే చెప్పాలి. ఇదే విష‌యాన్ని పాక్ సీబీఎఫ్‌సీ తీక్ష‌ణంగా ప్ర‌శ్నించింది. ఇలాంటి బూతు జోకులు, బూతు స‌న్నివేశాలు, ఓవ‌రాక్ష‌న్‌ ఉన్న సినిమాని పాకిస్తాన్‌లో రిలీజ్ చేయ‌నీయం అంటూ భీష్మించుకున్నారంతా. దీంతో పాక్‌లో వీరే ది వెడ్డింగ్ రిలీజ్‌పెండింగ్‌లో ప‌డింది. అక్క‌డ రిలీజ్ కాక‌పోయినా.. ఇక్క‌డ వ‌సూళ్లు కుమ్మేస్తుంది అన్న ధీమా మాత్రం ఉంది మ‌రి!

User Comments