`పందెంకోడి` ఫ్రాంఛైజీలో 3,4,5 చిత్రాలు

Last Updated on by

విశాల్ న‌టించిన పందెంకోడి ఫ్రాంఛైజీ నుంచి వ‌రుస‌గా సినిమాలు రానున్నాయి. 13 ఏళ్లుగా లింగుస్వామి పందెంకోడి సీక్వెల్ తీసేందుకు వ‌స్తూనే ఉన్నారు. ఇప్ప‌టికి పందెంకోడి 2 ఓకే అయ్యింద‌ని, ఇక ఈ ఫ్రాంచైజీలో పందెంకోడి 3ని వెంట‌నే ప్రారంభిస్తామ‌ని విశాల్ తెలిపారు. త్వ‌ర‌లో పందెంకోడి 3 ప్రారంభిస్తున్నాం.పందెంకోడి 4, 5 చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నామ‌ని విశాల్ పందెంకోడి 2 ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వేడుక‌లో తెలిపారు. పందెంకోడి 3లో కీర్తి సురేష్‌ని క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశామ‌న్నారు.

ద‌ర్శ‌కుడు లింగుస్వామి మాట్లాడుతూ – నేను ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించిన‌ పందెంకోడి, ఆవారా, ర‌న్ చిత్రాల్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలుగా ఆద‌రించారు. తెలుగు వారు మంచి సినిమాల్ని ఎప్పుడూ ఆద‌రిస్తున్నారు. అలాంటి ఓ మంచి సినిమా పందెంకోడి 2. తెలుగు నుంచి వ‌చ్చిన రంగ‌స్థ‌లం, గీత గోవిందం చిత్రాల్ని త‌మిళంలో బాగా ఆద‌రించారు. కీర్తి న‌టించి మ‌హాన‌టి చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. తెలుగు వారితో పూర్వ జ‌న్మ అనుబంధం ఉంది. అందుకే ప్ర‌తిసారీ ఇక్క‌డ నా సినిమాలు రిలీజ్ చేస్తున్నా.. అని అన్నారు.

చ‌ర‌ణ్ లేదా ఎన్టీఆర్ చేయాల్సిన‌ది:
విశాల్ న‌టించిన డెబ్యూ సినిమా పందెంకోడి రైట్స్ కోసం అప్ప‌ట్లోనే టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పోటీప‌డ్డార‌ని పందెంకోడి 2 ప్ర‌చార వేడుక‌లో విశాల్ తెలిపారు. అయినా నాన్న‌గారు ప‌ట్టుద‌ల‌తో త‌న‌ని ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేశార‌ని వెల్ల‌డించారు. పందెంకోడి 2 ట్రైల‌ర్ అహూతుల్ని రంజింప‌జేసింది.

User Comments