పందెంకోడి వ‌ర్సెస్ ఎగ్జిబిట‌ర్స్‌?

Last Updated on by

విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `పందెంకోడి 2` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడులో భారీగా రిలీజైంది. మ‌రికాసేప‌ట్లో కాయా పండా అన్న‌ది రిపోర్ట్ అంద‌నుంది. ఈలోగానే ఊహించ‌ని ఓ వివాదం విశాల్ `పందెంకోడి2`కి చిక్కులు తెచ్చి పెట్టింద‌ని తెలుస్తోంది. విశాల్ సినిమాని రిలీజ్ కానీకుండా ఎగ్జిబిట‌ర్ సంఘం అడ్డుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది.

గ‌త కొంత‌కాలంగా పైర‌సీకారుల‌పై వార్ న‌డిపిస్తున్న విశాల్ నేడు `పందెంకోడి 2` రిలీజ్ వేళ త‌మిళ‌నాడు- తిరుచ్చిలోని ఓ థియేట‌ర్‌(తాంజోర్‌)లో పైర‌సీకారుల్ని ప‌ట్టేశాడు. ఆ క్ర‌మంలోనే తిరుచ్చి ప్రాంతంలోని 10 థియేట‌ర్ల‌లో అసలు సినిమాలేవీ రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుని హోదాలో ప్ర‌క‌టించాడు. దీంతో అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. తిరుచ్చి లోక‌ల్ ఎగ్జిబిట‌ర్ల‌లో గ‌డ‌బిడ మొద‌లై, దాదాపు 40 థియేట‌ర్ల‌లో `పందెంకోడి 2` చిత్రాన్ని రిలీజ్ చేయ‌నీకుండా బ‌హిష్క‌రించారు. గొడ‌వ చినికి చినికి గాలివాన అయ్యేట్టే క‌నిపిస్తోంది. అయితే పొగ‌రు ఒగ‌రు ఉన్న పందెంకోడి లాంటోడు విశాల్. మ‌రి ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించుకుంటాడో చూడాలి. పైరేట్‌ల‌ను వేటాడాలి. ఎగ్జిబిట‌ర్ నాట‌కాల్ని ఎదురొడ్డి గెల‌వాలి. అప్పుడే అత‌డు సిస‌లైన పందెంకోడి అన్న‌మాట‌!!

User Comments