15 మంది భామ‌లు నో చెప్పారు!

Last Updated on by

మా సినిమాలో గీత, గోవిందం మ‌ధ్య సాగే గొడ‌వ‌లేంటో తెర‌పైనే చూడాలి. గీత‌కో ఐడియాల‌జీ, గోవిందానికో ఐడియాల‌జీ .. ఈ రెండిటి మ‌ధ్య వ‌చ్చే కాన్‌ప్లిక్ట్‌ని తెర‌పై చూడండి అని అన్నారు ప‌ర‌శురామ్‌. గీత‌కు గోవిందం గోవిందానికి గీత ప్ర‌తినాయ‌కులుగా క‌నిపిస్తార‌ని, అందులో బోలెడంత ఫ‌న్ ఉంటుంద‌ని అన్నారు ప‌ర‌శురామ్‌. విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వ ం వ‌హించిన ‘గీత గోవిందం’ ఆగష్టు 15న సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ప‌ర‌శురామ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెప్పాడు.

దేవ‌ర‌కొండ ఈ చిత్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. నిజానికి తను జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగం కోసం వేచి చూస్తూ.. ఆ గ్యాప్ లో ఓ ప్ర‌యివేటు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప‌ని చేస్తుంటాడు. ఇక గీత ఐటీ ఉద్యోగిగా కనిపిస్తుంది. అలానే మా సినిమాలో విల‌న్‌లు ఉండ‌రు. హీరో హీరోయిన్ ఒక‌రికొక‌రు విల‌న్లు. అలానే దేవ‌ర‌కొండ అర్జున్‌రెడ్డిలో పాత్ర‌కు ఈ సినిమాలో పాత్ర‌కు ఏ సంబంధం లేదు. అర్జున్ రెడ్డి పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అక్క‌డ అలా అగ్రెస్సివ్ గా క‌నిపిస్తే, మా సినిమాలోని పాత్రకు త‌గ్గ‌ట్టు నటించాడు. గీత గోవిందంలో చాలా మంచి అణ‌కువ ఉన్న‌ కుర్రాడు. కుటుంబ విలువ‌లు తెలిసిన‌ ఓ మంచి వ్యక్తిగా తెర‌పై క‌నిపిస్తాడ‌ని తెలిపారు. ఈ సినిమా కోసం 15 మంది నాయిక‌ల‌కు క‌థ వినిపిస్తే ఎవ‌రికీ కుద‌ర‌లేదు. అప్ప‌టికి దేవ‌ర‌కొండ కొత్త హీరో కాబ‌ట్టి, భామ‌లెవ‌రూ ముందుకు రాలేద‌ని ప‌ర‌శురామ్‌ చెప్పారు. ఆ క్ర‌మంలోనే ర‌శ్మిక‌ను ఎంపిక చేశామ‌ని అన్నారు

User Comments