ప‌ర‌శురామ్‌కి కొత్త ఫ్లాట్ కీస్

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిన చందంగా, ఒక్క సినిమా ప‌ర‌శురామ్ జీవితాన్నే మార్చేసింది. అదే గీత‌గోవిందం. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించి ఏకంగా 100కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం జ‌నాల్లో చ‌ర్చ‌కొచ్చింది. హిట్ట‌వుతుంద‌ని అనుకున్నాం కానీ ఇంత పెద్ద హిట్ట‌వుతుంద‌ని ఎవ‌రూ భావించ‌లేద‌ని టీమ్ చెబుతోంది. ఇక హిట్టొచ్చిన వేళా విశేషం .. ప‌ర‌శురామ్‌కి అన్నీ మంచి శ‌కునాలే క‌నిపిస్తున్నాయి. అత‌డు మ‌రో సినిమాని జీఏ2 బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కించేందుకు క‌మిట‌య్యాడు. దీనికి అత‌డు అందుకున్న అడ్వాన్స్ ఏంటో తెలుసా?

హైద‌రాబాద్‌లో ఓ ఖ‌రీదైన ఏరియాలో ఖ‌రీదైన ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా అందుకున్నాడు. ఆ మేర‌కు జీఏ2 అధినేత బ‌న్ని వాసు కొత్త ఇంటి కీస్‌ని అత‌డికి అందించాడ‌ట‌. ఇది కేవ‌లం అడ్వాన్స్ మాత్ర‌మే. అంటే మునుముందు పారితోషికంలో బ్యాలెన్స్ మొత్తం అందుకుంటాడు. గీత గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టింది కాబ‌ట్టి దీనికి సీక్వెల్ క‌థ ఏమైనా రాస్తున్నాడా? అన్న‌ది చూడాలి. అయితే ఇప్పుడు బ‌న్నివాస్‌కి వేరొక క‌థ‌ను వినిపించాడ‌ట‌. అది బాగా న‌చ్చి ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది.