న‌రేంద్ర‌ మోదీ పాత్ర‌ధారి..

Last Updated on by

భార‌త‌దేశంలో డిజిట‌ల్ ఇండియా సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. డిజిట‌ల్ ఇండియా ప‌ర్య‌వ‌సానాల గురించి ప్ర‌జ‌లంతా మాట్లాడుకుంటున్నారు. మోదీ విధానాల‌ను అనుస‌రించేవాళ్లు, సమ‌ర్ధించేవాళ్లు కొంద‌రే ఉంటే, వ్య‌తిరేకించేవాళ్లు అంత‌కుమించి ఉన్నారు. ఆ క్ర‌మంలోనే డిజిట‌ల్ ఇండియాని విమ‌ర్శిస్తూ తెర‌కెక్కించిన `అభిమ‌న్యుడు` బంప‌ర్‌హిట్ కొట్టింది. `ఇరుంబు తిరై` పేరుతో విశాల్ న‌టించిన ఈ సినిమాపై త‌మిళ‌నాట‌ మోదీ ఉక్కుపాదం మోపార‌న్న ప్ర‌చారం ఉంది.

ఇక‌పోతే దేశంలోనే సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు ఏకైక కార‌కుడిగా.. ప్ర‌ధాని మోదీ పేరు మార్మోగిపోతోంది. నోట్ల ర‌ద్దుతో అత‌డు పెను భూకంపానికే కార‌ణ‌మ‌య్యారు. అత‌డి నిర్ణ‌యం ఎంద‌రో వ్యాపారులు, రాజ‌కీయ‌నాయ‌కులు, `న‌ల్ల‌` దొర‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించింది. ఆ క్ర‌మంలోనే మోదీ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తే అది ఎంతో ఉద్విగ్న‌త‌తో కూడుకుని ఉంటుంద‌ని ఫిలింమేక‌ర్స్ భావించారు. స‌రిగ్గా ఏడాది కింద‌ట‌.. టాయ్‌లెట్ సినిమా రిలీజ్ వేళ మోదీ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తే అందులో అక్ష‌య్‌కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని చెప్పుకున్నారు. ఆ క్ర‌మంలోనే ప‌రేష్‌రావ‌ల్‌, అనుప‌మ్ ఖేర్ వంటి న‌టుల పేర్లు టైటిల్ పాత్ర‌కు వినిపించాయి. అయితే ఇన్నాళ్లు మోదీ పాత్ర‌లో ఎవ‌రు చేస్తారు? అన్న‌దానికి స‌రైన స‌మాధానం లేదు. ఇప్ప‌టికి దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. మోదీ బ‌యోపిక్‌లో ప‌రేష్ రావ‌ల్ టైటిల్ పాత్ర పోషించనున్నారుట‌. స్క్రిప్ట్ లాక్ చేశామ‌ని ప‌రేష్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇక‌పోతే .. మోదీ ఫాలోవ‌ర్‌, వీరాభిమాని అయిన శ‌త్రుఘ్న సిన్హా .. ఇటీవ‌లే లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో తాను మోదీగా న‌టిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ రేర్ ఛాన్స్ ప‌రేష్ రావ‌ల్‌కి ద‌క్కింది కాబ‌ట్టి సిన్హాజీకి లేన‌ట్టేన‌న్న‌మాట‌!

User Comments