ఫోటో టాక్‌: బీచ్‌లో కుంద‌న‌పు బొమ్మ‌

Last Updated on by

ఆసీస్‌లో అడుగుపెట్టింది.. కంగారూల‌నే కంగారు పెట్టింది. తొలుత బెదురు చూపులు చూసిన కంగారూలు ఆ త‌ర‌వాత ప‌ర‌దేశీ మ‌న కోస‌మే వ‌చ్చిందంటూ చెలిమి చేశాయి. ఆ దృశ్యాల్ని స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ప‌రిణీతి కంగారూలను స్పెష‌ల్ ఫ్రెండ్స్‌గా అభివ‌ర్ణించింది. ఆ దృశ్యాన్ని ఇంకా మ‌రువ‌క ముందే.. ఆస్ట్రేలియా బీచ్ నుంచి అదిరిపోయే ఫోటో ఒక‌టి పంపించింది పారీ.

గ‌త రెండు వారాలుగా ఆసీస్ ట్రిప్‌లో అదే ప‌నిగా ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మ‌డు ఓ స్పెష‌ల్ విమానంలో దీవుల‌న్నీ చుట్టేస్తోంది. లేటెస్టుగా మాన‌వ‌మాత్రుడు అనేవాడు అడుగుపెట్ట‌లేని ఓ అంద‌మైన ఒంట‌రి దీవిలో అడుగుపెట్టింది. ఆచోట ప్ర‌కృతి సౌంద‌ర్యానికి, బీచ్ సొగ‌సున‌కు ఫిదా అయిపోయిన ఈ భామ అక్క‌డో ఫోటో దిగి ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్ చేసింది. స్వ‌ర్గంలోకి సీప్లేన్‌లో ఎగిరి మ‌రీ వ‌చ్చాను. క్వీన్స్ ల్యాండ్ ఆఫ్‌ ఆస్ట్రేలియా…వైట్ హెవెన్ బీచ్ ..ఇదే“ అంటూ వివ‌రం అందించింది. `పైరేట్స్ ఆఫ్ ది క‌రేబియ‌న్‌` ఇక్క‌డే తెర‌కెక్కించార‌ని త‌న అంచ‌నాని చెప్పింది. మొత్తానికి పారీ ఆస్ట్రేలియా, ఆ చుట్టుప‌క్క‌ల దీవుల‌న్నీ చుట్టేస్తోంది. ఒక‌వేళ ఆసీస్‌ని ప‌రిణీతి సునామీ చుట్టుముట్టేయ‌దు క‌దా?

User Comments