పిక్ టాక్‌: `కంగారూ`పెట్ట‌కే ఇలా!

Last Updated on by

లేడీస్ వ‌ర్సెస్ రిక్కీ బాల్‌, ఇషాక్‌జాదే, శుధ్ దేశీ రొమాన్స్‌, కిల్ దిల్, దిష్యూం వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించింది ప‌రిణీతి చోప్రా. ఇటీవ‌లే బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ గోల్ మాల్ రిట‌ర్న్స్‌లో అద్భుత‌ న‌ట‌న‌తో మైమ‌రిపించింది. ఈ విజ‌యం త‌ర‌వాత వ‌రుస‌గా మూడు సినిమాల‌కు సంత‌కాలు చేసిన ఈ భామ ప్ర‌స్తుతం `కేస‌రి, న‌మ‌స్తే ఇంగ్లండ్‌, సందీప్ ఔర్ పింకీ ఫ‌రార్ చిత్రాల‌తో బిజీగా ఉంది.

లేటెస్టుగా ఆస్ట్రేలియా ట్రిప్‌లో ఇదిగో ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆసీస్ జాతీయ జంతువు కంగారూతో చెలిమి చేసిన ప‌రిణీతి ఆనందంతో పార‌వ‌శ్యం చెందింది. చూశారా నా ఫ్రెండ్‌ను క‌ల‌వాల‌నుకుంటే క‌ల‌వండి. మెల్‌బోర్న్ బ‌ల్లార‌త్‌లో ఈ ఛాన్స్‌.. అంటూ ట్వీట్ చేసింది.

User Comments