పరమాణు టీజర్:ఫోక్రాన్ గుట్టు విప్పే సినిమా

Last Updated on by

నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాలు తీయ‌డం నేటి ట్రెండ్‌. ఇలా తెర‌కెక్కుతున్న సినిమాలు ఎలాంటి ప్ర‌కంప‌నాలు సృష్టించ‌డానికి అయినా ఆస్కారం ఉంటుంది. అందునా దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించిన కీల‌క విష‌యాల్ని చ‌ర్చించే క‌థాంశాల‌తో సినిమాలు తీస్తే అందులో వివాదాస్ప‌ద అంశాల‌కు ఆస్కారం ఉంటుంది. ఇటీవ‌లే రిలీజై విజ‌యం సాధించిన రాజ‌శేఖ‌ర్ `గ‌రుడ‌` సినిమా ఈ త‌ర‌హాలోనే వివాదంలోకి వ‌చ్చింది. తాజాగా అదే త‌ర‌హా క‌థాంశంతో ఆ కోవ‌లోనే తెర‌కెక్కిన బాలీవుడ్ సినిమా `ప‌ర‌మాణు`. ఫోక్రాన్ అణు ప‌రీక్ష‌లు, డ‌ర్టీ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా మే 25న రిలీజ‌వుతోంది.

వాస్త‌వానికి ఈ సినిమా ఈపాటికే రిలీజ్‌కి రావాల్సి ఉన్నా.. నిర్మాత ప్రేర‌ణ అరోరాతో హీరో జాన్ అబ్ర‌హాం గొడ‌వ‌లు ప‌డ‌డం వ‌ల్ల వాయిదా పడింది. జాన్‌కి 35 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు అంగీక‌రించి 34 కోట్ల వ‌ర‌కూ పారితోషికం ముట్ట‌జెప్పినా అత‌డు బ్యాలెన్స్ అమౌంట్ కోసం త‌న‌ని హింసించాడ‌ని, స‌హ‌నిర్మాత అయినా ఇలా బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ప్రేర‌ణ ఆరోపించారు. ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ని ఆన్ లొకేష‌న్ అంద‌రి ముందు అవ‌మాన‌క‌రంగా మాట్లాడాడ‌ని స‌ద‌రు లేడీ నిర్మాత ఆవేద‌న చెందారు. మొత్తానికి గొడ‌వ‌ల‌న్నీ స‌మ‌సిపోయి ఇప్ప‌టికి రిలీజ‌వుతోంది. జాన్ అబ్ర‌హాం- డ‌య‌నా పెంటి, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెటిల్‌మెంట్ అనంత‌రం రిలీజ్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.

User Comments