ప‌టాస్.. టెంప‌ర్ ఓకే.. మ‌రి సుల్తాన్..?

జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ లో కావాల్సినంత నంద‌మూరి మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ సాగింది. అక్క‌డ అన్నాద‌మ్ముల అనుబంధం గురించి ఎన్నో మాట‌లు వినిపించాయి. హ‌రికృష్ణ కూడా త‌న‌యులు చేసిన ఈ చిత్రం గురించి ఎంతో గొప్ప‌గా మాట్లాడారు. ముఖ్యంగా త‌న పెద్ద కుమారుడు స్వ‌ర్గీయ జాన‌కిరామ్ గురించి స్మరించుకున్నాడు. ఈ చిత్రం జాన‌కిరామ్ ఆశ అని చెప్పాడు హ‌రికృష్ణ‌. ఇందులో మూడు పాత్ర‌లున్నా కూడా త‌నకు న‌చ్చిన పాత్ర మాత్రం జై ఒక్క‌టే అని చెప్పాడు హ‌రికృష్ణ‌. దానికి కార‌ణం కూడా చెప్పాడు. ఆనాడు ఎన్టీఆర్ నెగిటివ్ ను పాజిటివ్ చేసాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నాడు. ప‌టాస్.. టెంప‌ర్ సినిమాల్లో ముందు హీరోల పాత్ర‌లు నెగిటివ్ గా ఉండి త‌ర్వాత పాజిటివ్ అవుతాయ‌న్నాడు హ‌రికృష్ణ‌. మ‌రి ఈ క్ర‌మంలో త‌మ్ముడు బాల‌కృష్ణ న‌టించిన సుల్తాన్ సినిమా గుర్తుకు రాలేదు ఈ అన్న‌య్య‌కు. అందులోనూ బాల‌య్య నెగిటివ్ రోల్ చేసాడు. బాల‌య్య కెరీర్ లోనే ఆ సినిమా ఓ అద్భుతం. విల‌న్ రోల్ ఇంత భ‌యంక‌రంగా చేయొచ్చా అని సుల్తాన్ లో చూపించాడు బాల‌య్య‌. మ‌రి అలాంటి పాత్ర‌ను హ‌రికృష్ణ కావాల‌నే మ‌రిచిపోయాడా..? లేదంటే నిజంగానే ఆ టైమ్ కు గుర్తు రాలేదా..? ఏదేమైనా ప‌టాస్.. టెంప‌ర్ తో పోలిస్తే సుల్తాన్ లో బాల‌య్య చేసిన పాత్ర ఇంకా ప‌వ‌ర్ ఫుల్ అనేది మాత్రం నంద‌మూరి అభిమానుల‌తో పాటు మిగిలిన ప్రేక్ష‌కులు కూడా ఒప్పుకొని తీరాల్సిన స‌త్యం.