ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న పవర్ స్టార్..

Last Updated on by

అవును.. ఇప్పుడు నిజంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాస్తున్నాడు. కాక‌పోతే ఇవి అభిమానులు కానీ.. ప‌వ‌ర్ స్టార్ కానీ కోరుకునే రికార్డులు కావు. అప్ప‌ట్లో అత్తారింటికి దారేదితో ప‌వ‌న్ చేత ఇండ‌స్ట్రీ రికార్డులు ముందు నుంచి తిర‌గ‌రాయించిన త్రివిక్ర‌మ్.. ఇప్పుడు అజ్ఞాత‌వాసితో వెన‌క నుంచి రాయిస్తున్నాడు. ఈ సినిమా 86 ఏళ్ల తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత న‌ష్టాల‌ను తీసుకొచ్చే డిజాస్ట‌ర్ గా మార‌నుంది. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డ్. సినిమా వ‌చ్చి అప్పుడే 10 రోజులు గ‌డిచిపోయింది. ఈ ప‌ది రోజుల్లో సినిమా వ‌సూలు చేసిన మొత్తం 55 కోట్ల షేర్.. 90 కోట్ల గ్రాస్. కానీ బిజినెస్ మాత్రం ఆకాశ‌మంత ఎత్తులో చేసింది ఈ చిత్రం. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఏ తెలుగు సినిమా చేయ‌ని రేంజ్ లో 155 కోట్ల బిజినెస్ చేసింది అజ్ఞాత‌వాసి.

సౌత్ లో 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన మూడు సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. దీనికి ముందు స్పైడ‌ర్.. మెర్స‌ల్ ఉన్నాయి. అంత బిజినెస్ చేసి కూడా అంచ‌నాలు అందుకున్న సినిమా మెర్స‌ల్ మాత్ర‌మే. ఈ చిత్రం 244 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది. ఇక అజ్ఞాతవాసి మాత్రం అడ్డంగా బ‌య్య‌ర్ల‌ను ముంచేయ‌డానికి రెడీ అయిపోయింది. 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు స‌గానికి పైగా ముంచేయ‌డానికి సిద్ధ‌మైంది. సంక్రాంతి సెల‌వులు.. ఆ త‌ర్వాత ఏ సినిమాలు లేక‌పోయినా.. ఇది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏం మాయ చేయ‌లేకపోతుంది. ఒక్క‌సారి ప‌డుకున్న త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు లేవ‌లేక‌పోయింది అజ్ఞాత‌వాసి. తొలిరోజే అజ్ఞాత‌వాసంలోకి వెళ్ళిపోయింది. వెంకటేష్ ఉన్నా ఫ‌లితం మాత్రం శూన్యం. ఇప్పుడు ఈ చిత్రం త‌క్కువ‌లో త‌క్కువ 65 కోట్ల‌కు పైగానే బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు తీసుకొస్తుంద‌ని అంచ‌నా. గ‌తంలో స్పైడ‌ర్ పేరు మీదున్న న‌ష్టాల రికార్డును ఇప్పుడు స‌గ‌ర్వంగా ప‌వ‌న్ తీసుకుంటున్నాడు. మొత్తానికి అప్పుడు పై నుంచి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన ప‌వ‌ర్ స్టార్.. ఇప్పుడు కింది నుంచి ఇండ‌స్ట్రీ రికార్డులు కదిలిస్తున్నాడు.

Follow US 

User Comments