అజ్క్షాత‌వాసి.. అద‌ర‌హో.. అద్భుత‌హః..

వ‌చ్చేసింది.. వ‌చ్చేసింది.. అజ్ఞాత‌వాసి టీజ‌ర్ వ‌చ్చేసింది.. అభిమానుల అంచ‌నాలు ఏ మాత్రం త‌గ్గ‌కుండా.. సినిమాపై ఇప్పుడున్న అంచ‌నాలు చాల‌వంటూ.. ఇంకా పెంచేసేలా టీజ‌ర్ వ‌చ్చేసింది. అద్భుత‌మైన విజువ‌ల్స్ తో ప‌వ‌న్ మాయ చేసాడు. త్రివిక్ర‌మ్ మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. మాట‌లతో మాయ చేయ‌లేదు కానీ విజువ‌ల్స్ తో క‌ట్టి పడేసాడు. అద్భుత‌మైన ఫైట్స్.. దానికి మించి ప‌వ‌న్ అప్పియ‌రెన్స్.. కామెడీ.. యాక్ష‌న్ అన్నీ అదుర్స్ అనిపించాడు త్రివిక్ర‌మ్.

ఇక ప‌వ‌న్ గ్లామ‌ర్ గురించి ఏం చెప్పాలి..? 50కి చేరువ‌లో ఉన్నా కూడా ఇప్ప‌టికీ కుర్రాడిలా మెరిసి పోయాడంతే. అ..ఆ టీజ‌ర్ త‌ర‌హాలోనే కృష్ణుడి స్తోత్రంతో ఈ టీజ‌ర్ అంతా న‌డిచింది. చివ‌ర్లో మాత్రం అత‌డి చ‌ర్య‌లు అద్భుతం అంటూ ఊరించాడు ద‌ర్శ‌కుడు. ఇక ప‌వ‌న్ కూడా త‌న‌దైన కామెడీ.. యాక్ష‌న్ టైమింగ్ తో కేక పెట్టించాడు. ఈ టీజ‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా అజ్ఞాత‌వాసిపై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. జ‌న‌వరి 10న సినిమా విడుద‌ల కానుంది.