ప్ర‌జావేదిక కూల్చివేత‌ను స‌మ‌ర్థించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

Where is Pawan Kalyan Now?

ఆంద్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధికారంలో ఉండ‌గా కృష్ణాన‌ది ఒడ్డున అక్ర‌మంగా నిర్మించిన ప్ర‌జావేదిక‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూల‌గొట్టింది. దీనిపై టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెట్టారు. అయితే జ‌న‌సేత అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఈ చ‌ర్య‌ను స‌మ‌ర్థించారు. అవినీతి వ్య‌తిరేక పో రాటంలొ జ‌గ‌న్ స‌ర్కార్‌కు చేదోడు వాదోడుగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను ఎవ‌రూ ప్రోత్స‌హించ‌కూడ‌ద‌ని చెప్పారు. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌భుత్వానికి కొండంత ధైర్యం వ‌చ్చింది. అలాగే సీఎం జ‌గ‌న్ అవినీతి ర‌హిత పాల‌న‌పై చేసిన ప్ర‌క‌ట‌న‌ను కూడా ప‌వ‌న్ స్వాగ‌తించారు. ఇసుక‌, మ‌ట్టి మాఫియాల నుంచి అవినీతిప‌రులెంత‌టి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ప్ర‌భుత్వం విడిచిపెట్ట‌ద‌ని జ‌గ‌న్ చేసిన హెచ్చ‌రిక‌ల‌కు కూడా ప‌వ‌న్ సానుకూలంగా స్పందించారు. అవినీతి వ్య‌తిరేక పోరాటంలో ప్ర‌భుత్వానికి అండ‌గా ఉంటామ‌ని అయితే ప్ర‌జ‌లకు న‌ష్టం క‌లిగించే విధానాల‌పై నిల‌దీస్తామ‌ని స్ప‌ష్టంచేశారు.

త‌ప్పును త‌ప్పుగా ఎత్తి చూప‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, అనుమ‌తులు లేవ‌న్న సాకుతో ప్ర‌జావేదిక ఒక్క‌దానినే కూల్చివేత‌తో స‌రిపెట్ట‌కుండా మిగ‌తా అక్ర‌మ నిర్మాణాల‌ను కూడా తొలించాల్సిందేన‌ని లేకుంటే ప్ర‌భుత్వ‌చిత్త‌శుద్ధిపై అనుమానం వ‌స్తుంద‌ని ప‌వ‌న్ చెప్పారు. అనుమ‌తులు లేని భ‌వ‌నాలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో గుర్తించి అన్నింటిని కూలిస్తే ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లుగుతుంద‌న్నారు. ప్ర‌జావాణిని స‌మ‌ర్ధంగా వినిపిస్తే పార్టీకి మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని బ‌రోసా ఇచ్చారు. స్జానిక సంస్జ‌ల‌పై దృష్టిపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని స‌మ‌ర్థులైన జెడ్పీటీసుల‌ను గెలిపించుకోవాల‌ని పార్టీ క్యాడ‌ర్‌కు హితోప‌దేశం చేశారు.

Also Read : Chai And Sai Pallavi To Begin Romance In September