పవన్ సేమ్ టు సేమ్ చిరులాగే

Pawan following Chiru Style

రీ ఎంట్రీ విష‌యంలో అన్న‌య్య చిరంజీవి.. త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సేమ్ టు సేమ్ అనిపిస్తున్నారు.  చిరంజీవి త‌న  150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అభిమానుల్లో ఉన్న అంచ‌నాల్ని దృష్టిలో పెట్టుకొని  సోష‌ల్ ఎలిమెంట్స్‌, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో కూడిన  క‌థ‌ని ఎంచుకున్నారు. `ఖైదీ నంబ‌ర్ 150` చేశారు. అది త‌మిళంలో విజ‌య‌వంత‌మైన  ఓ సినిమాకి రీమేక్ అన్న విష‌యం తెలిసిందే. చిరు  151వ సినిమాకి వ‌చ్చేసరికి ఒక పీరియాడిక‌ల్ క‌థ‌ని చేశారు. అదే.. `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అన్న బాట‌లోనే న‌డుస్తున్నాడు.

ప‌వ‌న్ రీ ఎంట్రీ అంటే త‌న మార్క్ సోష‌ల్ ఎలిమెంట్స్‌ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. పైపెచ్చు  రాజ‌కీయ రంగంలో పోరాటం చేసి వ‌స్తున్నాడు. దాంతో స‌మాజానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న సోష‌ల్ స‌బ్జెక్ట్ అయితేనే బాగుంటుంద‌ని ఆయ‌న `పింక్‌` రీమేక్‌ని ఎంచుకున్నారు. అందులో ప‌వ‌న్ ఒక న్యాయ‌వాదిగా క‌నిపించ‌బోతున్నాడు. ఇక త‌ర్వాత సినిమానేమో అన్న‌లాగే ప‌వ‌న్ కూడా పిరియాడిక‌ల్ సినిమా  చేస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఆ సినిమాని ఈ రోజే హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మ‌వుతోంది. అన్న‌య్య గెడ్డం లేకుండా రీ ఎంట్రీ ఇచ్చాడు. ప‌వ‌న్ గెడ్డంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అంతే త‌ప్ప మిగ‌తాదంతా సేమ్ టు సేమ్ అన్న‌మాట‌. అన్న‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోరు ఇక‌పై ఆగేలా క‌నిపించ‌డం లేదు. రాజ‌కీయం, సినిమా… ఈ రెండింటినీ స‌మాంత‌రంగా న‌డ‌పాల‌నే వ్యూహంతో ఉన్నారాయ‌న‌. మొత్తంగా ప‌వ‌న్ స్కెచ్ ప‌క్కాగానే ఉన్న‌ట్టుంది.