అజ్ఞాత‌వాసి.. అయిపోతున్నాడు ప‌ర‌దేశీ..

ప‌వ‌న్ పేరు వింటే ఇక్క‌డి బాక్సాఫీస్ మాత్ర‌మే కాదు.. ఓవ‌ర్సీస్ కూడా షేక్ అయిపోతుంది. అక్క‌డ ఈయ‌న సినిమా వ‌చ్చిందంటే రికార్డుల షేపులు మారిపోవాల్సిందే. ఇక ఇప్పుడు అజ్ఞాత‌వాసి కూడా దీనికి మిన‌హాయింపేమీ కాదు. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. పాట‌లు మాత్ర‌మే బ్యాలెన్స్. తాజాగా డ‌బ్బింగ్ కూడా మొద‌లుపెట్టాడు ప‌వ‌ర్ స్టార్. ఇందులో ప‌వ‌న్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యువ‌ల్ న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది అజ్ఞాతవాసి. విడుద‌ల‌కు 22 రోజుల ముందుగా.. అంటే డిసెంబ‌ర్ 17నే ఈ చిత్ర బుకింగ్స్ ఓపెన్ చేసారు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు. 17న కొన్ని లొకేష‌న్లు.. 18న అన్ని లొకేష‌న్ల‌లో ఈ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. తెలుగు సినిమాకు ఇంత ముందుగా బుకింగ్స్ ఓపెన్ కావ‌డం ఇదే తొలిసారి. అంతేకాదు.. ఈ చిత్ర రైట్స్ కూడా 20 కోట్లు అమ్ముడ‌య్యాయ‌ని తెలుస్తుంది. బాహుబ‌లి కాకుండా ఇంత భారీ రేట్ కు అమ్ముడైన తొలి తెలుగు సినిమా ఇదే కావ‌డం విశేషం.

ఇప్పటి వ‌ర‌కు బాహుబ‌లి పేరు మీద మాత్రమే రికార్డ్ ఉంది. బాహుబ‌లి త‌ర్వాత 2.9 మిలియ‌న్ డాల‌ర్స్ తో శ్రీ‌మంతుడు ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అయితే ఒక్క 2 మిలియ‌న్ సినిమా కూడా లేదు. అలాంటిది త్రివిక్ర‌మ్ సినిమాపై ఏకంగా 20 కోట్లు పెట్ట‌డం అనేది సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ చిత్రంపై ఉన్న అంచ‌నాలు చూస్తుంటే ఓవ‌ర్సీస్ బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డం గ్యారెంటీ అని తెలుస్తుంది.

శాటిలైట్ రైట్స్ విష‌యంలోనూ అజ్ఞాత‌వాసి సంచ‌ల‌నం సృష్టించింది. ఓ లీడింగ్ ఛానెల్ 19.5 కోట్ల ఇచ్చి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే తెలుగులో ఇదో రికార్డ్. త్రివిక్రమ్- పవన్ కాంబినేష‌న్ కావ‌డంతో ఇంత‌గా రైట్స్ ప‌లికింద‌ని తెలుస్తోంది. గ‌తంలో బాహుబ‌లి రెండు భాగాల‌కు క‌లిపి 30 కోట్లు ఇచ్చారు. ఇక మ‌హేశ్ స్పైడ‌ర్ కు తెలుగు, త‌మిళ భాష‌ల‌కు క‌లిపి 25 కోట్ల‌కు పైగా ఇచ్చారు. కానీ ఒక్క భాష‌లోని సినిమాకు మాత్రం ఇంత‌గా రేట్ ఇవ్వ‌డం ఇదే తొలిసారి. అదే ప‌వ‌న్ స్పెషాలిటీ. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్ల‌కు చేరువ‌గా వెళ్తుంద‌ని తెలుస్తోంది. చూడాలి మ‌రి.. అజ్ఞాత‌వాసి అరాచ‌కాలు ఏ రేంజ్ లో ఉండ‌బోతున్నాయో త్వ‌ర‌లోనే తేల‌నుంది.

User Comments