ముందు ప‌వ‌న్.. త‌ర్వాత క‌ళ్యాణ్..!

Last Updated on by

అదేంటి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ప‌రేట్ ఎందుకు..? ఇద్ద‌రూ ఒక్క‌టే క‌దా.. మ‌ళ్లీ వేర్వేరుగా పిల‌వ‌డం ఎందుకు అనుకుంటున్నారా..? అవును.. క‌రెక్టే.. కానీ వాళ్ల‌కు మాత్రం ప‌వ‌న్ వేరు.. క‌ళ్యాణ్ వేరు..! ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఇక్క‌డ మ‌నం మాట్లాడుకుంటున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్.. క‌ళ్యాణ్ రామ్ గురించి. క‌ళ్యాణ్ కామ‌న్ అయినా ఇద్ద‌రూ వేరు క‌దా..! ఈ ఇద్ద‌రికి ఇప్పుడు ఒక‌చోట పొత్తు కుదిరింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేయ‌డం లేదు. కానీ క‌ళ్యాణ్ రామ్ చేస్తోన్న నా నువ్వేకు మాత్రం అజ్ఞాత‌వాసితో లింక్ కుదిరింది. అదేంటంటే.. ఈ సినిమా మ్యూజిక్ హ‌క్కుల‌ను సోనీ తీసుకుంది.

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో చాలా సెలెక్టివ్ గా సినిమాలు తీసుకుంటున్నారు సోనీ సంస్థ‌. ఇలాంటి టైమ్ లో అజ్ఞాత‌వాసి త‌ర్వాత వాళ్లు ఇన్ని నెల‌ల గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న నా నువ్వే హ‌క్కులు తీసుకున్నారు. మలయాళ సంగీత ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ దీనికి స్వ‌రాలు అందించాడు. త‌మ‌న్నా, క‌ళ్యాణ్ రామ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి జ‌యేంద్ర ద‌ర్శ‌కుడు. మ‌హేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. మ‌రి ఇన్ని రోజుల త‌ర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న సోనీకి అజ్ఞాత‌వాసి ఎలాగూ క‌లిసిరాలేదు. మ‌రి క‌ళ్యాణ్ రామ్ అయినా కోరిన విజ‌యం తీసుకొస్తాడా..?

User Comments