ప‌వ‌న్‌, చ‌ర‌ణ్ మిస్స‌య్యారేం?

Last Updated on by

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా మెగాస్టార్- సుకుమార్ ఆశీస్సుల‌తో సుక్కూ శిష్యుడి నిర్ధేశ‌నంలో కొత్త సినిమా నేడు హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కాకినాడ బుచ్చిబాబు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మైత్రి సంస్థ‌తో క‌లిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక‌పోతే ఈ ఈవెంట్ లో చిరంజీవి, అల్లు అర‌వింద్, బ‌న్ని, వ‌రుణ్ తేజ్, నిహారిక స‌హా మొత్తం మెగా తార‌లంతా పాల్గొన్నారు.

అయితే ఇద్ద‌రే ఇద్ద‌రు మాత్రం మిస్స‌య్యారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ ఈవెంట్‌లో క‌నిపించ‌లేదు. అందుకు కార‌ణ‌మేంటి? అని ఆరాతీస్తే …. ప‌వ‌న్ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల మ‌నిషిగా బిజీగా ఉన్నారు. పార్టీ ప్ర‌చార క‌లాపాల్లో బిజీబిజీగా ఉన్నారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో బిజీ బిజీ. అందువ‌ల్ల ఆ ఇద్ద‌రూ రాలేక‌పోయారు. ఆ బాధ్య‌త మొత్తం మెగాస్టార్ చిరంజీవి- బాస్ అల్లు అర‌వింద్ తీసుకున్నారు. ద‌గ్గ‌రుండి క‌థంతా న‌డిపించారు. ఇక త‌న అభిమాన మేన‌ల్లుడికి జన‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే బ్లెస్సింగ్స్ అందించారు. రామ్ చ‌ర‌ణ్ సైతం బావ‌మ‌రిధికి ఆల్ ది బెస్ట్ చెప్పార‌ట‌. అంద‌రి బ్లెస్సింగ్స్ తోనే వైష్ణ‌వ్ లాంచ్ అయ్యాడ‌న్న‌మాట‌.

User Comments