ప‌వ‌న్-త్రివిక్ర‌మ్.. ఇంకో సినిమా..!

Last Updated on by

ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స్నేహితుల గురించి చెప్పాలంటే బాపు ర‌మ‌ణ‌.. ఆ త‌ర్వాత అచ్చిరెడ్డి-ఎస్వీ కృష్ణారెడ్డి అనేవాళ్లు. కానీ ఇప్పుడు స్నేహం గురించి చెప్ప‌మంటే ప‌వ‌న్-త్రివిక్ర‌మ్ అంటారు. కేవ‌లం ద‌ర్శ‌కుడు-హీరో మ‌ధ్య ఉండే రిలేష‌న్ కాదు వాళ్లిద్ద‌రిది. ప‌వ‌న్ ను బాగా అర్థం చేసుకున్నాడు మాట‌ల మాంత్రికుడు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఆయ‌న్ని దేవున్ని చేసాడు. అజ్ఞాత‌వాసి ముందు వ‌ర‌కు కూడా ఎక్క‌డ చూసినా ఇద్ద‌రూ క‌లిసే క‌నిపించే వాళ్లు. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావ‌డం.. ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెర‌గ‌డం రెండూ ఒకేసారి మొద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లోనే బిజీ కావ‌డంతో ఎందుకో తెలియ‌దు కానీ త్రివిక్ర‌మ్ పూర్తిగా ప‌వ‌న్ కు దూరంగా వ‌చ్చేసాడు. ఈయ‌న సినిమాతో బిజీగా ఉండ‌టం.. ప‌వ‌న్ అక్క‌డ‌.. ఇద్ద‌రి మ‌ధ్య దూరం ఊహించ‌లేనంత పెరిగిపోయింది.

అదే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి అనే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఒకే ఫోటోతో తామెప్ప‌టికీ బెస్ట్ ఫ్రెండ్స్ అని నిరూపించారు ఈ ఇద్ద‌రూ. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్-త్రివిక్ర‌మ్ క‌లిసి క‌నిపించారు. ర‌వీంద్ర‌భార‌తిలో త్రివిక్ర‌మ్ భార్య సౌజ‌న్య భ‌ర‌త‌నాట్య క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌కు ప‌వ‌న్ కూడా స‌తీస‌మేతంగా వ‌చ్చాడు. అక్క‌డే చాలా సేపు ముచ్చ‌టించారు కూడా. బ‌హుశా రాజ‌కీయాల్లో ఫ్రీ అయిన త‌ర్వాత మ‌రోసారి త్రివిక్ర‌మ్ తోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చేస్తాడేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. 2020లో ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికైతే రాజ‌కీయాలే అంటున్న ప‌వ‌ర్ స్టార్.. ఫ్యూచ‌ర్ లో సినిమాల‌కు మ‌ళ్లీ చేరువ‌గా వ‌స్తాడేమో చూడాలి..! అది కూడా స్నేహితుడి సినిమాతో అయితే అంత‌కంటే కావాల్సిందేం ఉంది..? ప‌నిలో ప‌నిగా అజ్ఞాత‌వాసి అప్పు కూడా తీర్చేసుకుంటాడు త్రివిక్ర‌మ్.

User Comments