ప‌వ‌న్ హైద‌రాబాద్ వ‌చ్చేసాడు..

 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇండియా వ‌దిలేసి నెల రోజులు దాటిపోయింది. అక్క‌డే త‌న సినిమా షూటింగ్ తో పాటు లండ‌న్ లో జ‌రిగిన తెలుగు స‌మ్మేళ‌నం స‌ద‌స్సు.. అక్క‌డ వారిచ్చిన ఎక్స్ లెన్స్ అవార్డును స్వీక‌రించాడు ప‌వ‌ర్ స్టార్. బల్గేరియా షూటింగ్ కూడా పూర్తి చేసాడు. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమా ఫారెన్ షెడ్యూల్ పూర్త‌యింది. ప‌వ‌న్ అత‌డితో పాటు త్రివిక్ర‌మ్ యూనిట్ అంతా హైద‌రాబాద్ వచ్చేసారు. ఆయ‌న హైద‌రాబాద్ లో న‌వంబ‌ర్ 20 ఉద‌యం 5.45 నిమిషాల‌కు వ‌చ్చారు. ప‌వ‌న్ కు ఎయిర్ పోర్ట్ అధికారులు
ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌న ఇండియ‌న్ ప‌క్క దేశంలో అవార్డు తీసుకుని రావ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణం అంటూ పొగిడేసారు. ఇక‌పై సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల్లో బిజీ అవ్వాల‌ని చూస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో వారం ప‌ది రోజుల షెడ్యూల్ మాత్ర‌మే బాకీ ఉంది. అది కూడా హైద‌రాబాద్ లోనే. అది పూర్తైతే ఇక ప‌వ‌న్ ఫ్రీ బ‌ర్డ్. డిసెంబ‌ర్ నుంచి కాక‌పోయినా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి పూర్తిగా పాలిటిక్స్ లోకి దిగ‌బోతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మైత్రి మూవీ మేక‌ర్స్ కు ఓ సినిమా చేయాల్సి ఉన్నా అది ఇప్ప‌ట్లో కుదిరేలా క‌నిపించ‌ట్లేదు.

Follow US