మేం మేం ఒక్క‌టే.. మెగా బంధాలు..

Last Updated on by

ఈ ఫోటో చూస్తుంటే ఇప్పుడు ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. మ‌నుషులు దూరంగా ఉన్నంత మాత్రాన మ‌న‌సులు కూడా దూరంగా ఉన్న‌ట్లు కాదు. ఈ విష‌యం చాలా మంది అర్థ‌మ‌య్యేలా చెబుతున్నారు మెగా హీరోలు. వీళ్లంతా ఎప్పుడూ దూరంగా ఉన్న‌ట్లే క‌నిపిస్తారు.. కానీ మెగా కుటుంబం ఎప్పుడూ ఒక్క‌టే. ఈ విష‌యం చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు మ‌రోసారి ఇదే ప్రూవ్ అయింది కూడా. అన్నాద‌మ్ములు రాజ‌కీయంగా వేరు వేరు ఉంటారేమో కానీ వాళ్లు మ‌నుషులుగా ఎప్పుడూ ఒక్క‌టిగానే ఉంటారు. అన్న‌య్య మాటే ఇప్ప‌టికీ ప‌వ‌న్ కు రామ‌బాణం. ఇక అబ్బాయిలు కూడా ప‌వ‌న్ తో క‌లిసే ఉంటారు. దీనికి రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజే సాక్ష్యంగా నిలిచింది.Pawan Kalyan Celebrates Ram Charan Birthday at Chiranjeevi Houseతాజాగా చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిరు ఇంటికి వ‌చ్చి లంచ్ చేసి అబ్బాయికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపాడు ప‌వ‌ర్ స్టార్. అన్న‌య్య చిరంజీవి.. వ‌దిన సురేఖ‌తో క‌లిసి స‌ర‌ద‌గా కాసేపు గ‌డిపాడు. ఇప్పుడు ప‌వ‌న్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయినా కూడా అబ్బాయి కోసం త‌న ప‌నుల‌న్నీ ప‌క్క‌న‌బెట్టి మ‌రీ వ‌చ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ ఒక్క‌టి చాలు మెగా కుటుంబంలో బంధాలు అనుబంధాలు ఎలా ఉంటాయో.. ఉన్నాయో చెప్ప‌డానికి. అబ్బాయి పుట్టిన‌రోజుకు అన్న‌య్య ఇంట్లో వాలిపోయాడు ఈ బాబాయ్. ప్రేమ‌గా అబ్బాయికి త‌న ఆశీస్సులు అందించాడు. మొత్తానికి మెగా అనుబంధాలపై ఇక‌పై ఎవ‌రైనా ఓ మాట మాట్లాడాలంటే ఇవ‌న్నీ గుర్తొస్తాయేమో మ‌రి..?

User Comments