పింక్ రీమేక్.. ప‌వ‌న్ డైల‌మా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా బాలీవుడ్ లో విజ‌యం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు- హిందీ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటే.. రాజు గారు పింక్ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల‌లో సినిమా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ నోట పింక్ మాట ఏ సంద‌ర్భంలోనూ ఎక్క‌డా కూడా రాలేదు. దీంతో అస‌లు ప‌వ‌న్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడా? అన్న సందేహ‌మే మ‌రోసారి రెయిజ్ అవుతోంది. ఒక‌వేళ ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇచ్చిన పింక్ స‌రైన క‌థ కాద‌ని అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది.

ప‌వ‌న్ ఇమేజ్ కి త‌గ్గ క‌థ కాద‌ని, అయినా ప‌వ‌న్ అలాంటి సినిమాల్లో న‌టించ‌డ‌ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇస్తే అది పొలిటిక‌ల్ మైలేజ్ ఇచ్చేలా ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు ఓ ప్ర‌చారం బ‌లంగా సాగుతోంది. అప్ప‌ట్లో క‌ళా బంధు టి.సుబ్బ‌రామిరెడ్డి ఓ వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కులుగా ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న వ‌చ్చి కొన్ని సంవ‌త్స‌రాలు అవుతోంది.  ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ళ్లీ ఆ ఊసేలేదు. ప‌వ‌న్ గానీ, చిరంజీవి గానీ దీని గురించి ఎక్క‌డా స్పందిచ‌నూ లేదు. ఈ నేప‌థ్యంలో రాజు గారి పింక్ ప్ర‌క‌ట‌న కూడా ఇలాంటిదే అవుతుంద‌న్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌వ‌న్ మౌనం మ‌రింత డైలామ‌లోకి నెట్టేస్తోంది.  మ‌రి వీటిని ప‌వ‌న్ సందేహాలుగా మిగిల్చేస్తాడా?  లేక నిజం చేస్తాడా? అన్న‌ది ఆయ‌నే క్లారిటీ ఇవ్వాలి.