ప‌వ‌న్ కు మెగా హీరోల సపోర్ట్ ఇష్టం లేదా..?

Last Updated on by

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌డే ఇప్పుడు రాజ‌కీయాల్లో ఉన్నాడు. ఆయ‌న ఒక్క‌డే త‌న జ‌న‌సేన పార్టీని న‌డుపుకుంటున్నాడు. ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి కూడా తానొక్క‌డే క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇంట్లో అంత‌మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా ఒక్క‌ర్ని కూడా ప్ర‌చారానికి పిల‌వ‌డం లేదు ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న తిప్ప‌లు తాను ఒక్క‌డే ప‌డాల‌ని ముందే ఫిక్స్ అయిపోయాడు ప‌వ‌ర్ స్టార్. ఎవ‌రి అండ లేకుండానే జ‌నాల్లోకి వెళ్ల‌డానికి నిశ్చ‌యించుకున్నాడు ఈ హీరో. ఓ వైపు నాగబాబు.. మ‌రోవైపు ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధం అని చెబుతున్నా కూడా ప‌వ‌న్ వినిపించుకోవ‌డం లేదు. బాబాయ్ పిలిస్తే తాను ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు రామ్ చ‌ర‌ణ్.

ప్ర‌జారాజ్యంకు చేయాల‌ని ఉన్నా కూడా అప్పుడు చిన్న పిల్లాడివి వ‌ద్దన్నారు.. కానీ ఇప్పుడు చేయాల‌ని ఉందంటున్నాడు చ‌ర‌ణ్. అయితే ప‌వ‌న్ మాత్రం అంద‌రినీ దూరం పెడుతున్నాడు. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ప్ర‌జారాజ్యం టైమ్ లో అంతా క‌లిసి ప్ర‌చారం చేసినా.. మెగా కుటుంబం అంతా క‌లిసి దగా చేసింది అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పైగా చెడ్డ‌పేరు కూడా అంతా క‌లిసే పంచుకున్నారు. దాంతో ఇప్పుడు త‌న కుటుంబాన్ని రాజ‌కీయాల‌తో ముడి పెట్టాల‌ని అనుకోవ‌డం లేదు ప‌వ‌న్ క‌ళ్యాణ్. చావో రేవో తానొక్క‌డే తేల్చుకోవాల‌ని చూస్తున్నాడు. అందుకే చిరంజీవి కూడా జ‌న‌సేన‌లోకి వ‌స్తాడ‌నే వార్త‌ల్ని ముందుగానే ఖండించాడు ప‌వ‌ర్ స్టార్. మ‌రి.. ఈ ఒక్క‌డి సైన్యం ఎంత‌దూరం వెళ్తుందో..? ఎన్ని సీట్లు తెస్తుందో..?

User Comments