జ‌న‌సేనాని పవన్ చ‌ర్య‌లు ఊహాతీతం

Last Updated on by

ఎవ‌రి మైండ్ అయినా చ‌ద‌వొచ్చు కానీ ప‌వ‌న్ ను మాత్రం అంచ‌నా వేయ‌డం చాలా అంటే చాలా క‌ష్టం. ఈయ‌న్ని అర్థం చేసుకోడానికే ఓ జీవితం స‌రిపోయేలా లేదు. త్రివిక్ర‌మ్ ఇది ముందుగానే ఊహించాడో ఏమో కానీ అజ్ఞాత‌వాసిలో వీడి చ‌ర్య‌లు ఊహాతీతం అంటూ డైలాగ్ రాసాడు. ప‌వ‌న్ ఇప్పుడు చేస్తోన్న ప‌నులు కూడా ఇలాగే ఉన్నాయి. ఈయ‌న చేస్తున్న ప‌నులు ఇప్పుడు ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఏం చేస్తున్నాడు.. త‌న పార్టీని ఎటు వైపు తీసుకెళ్లాలి అనుకుంటున్నాడో అర్థం కావ‌డం లేదు. తాజాగా మ‌రో బ్రేకింగ్ న్యూస్ కూడా వ‌చ్చింది. ఈయ‌న త్వ‌ర‌లోనే కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌ల‌వ‌బోతున్నాడు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ హ‌ఠావ్ అని నినాదం ఇచ్చిన ప‌వ‌న్ ఎందుకు ఇప్పుడు రాహుల్ గాంధీని క‌లుస్తున్నాడ‌నేది ఇప్పుడు అస‌లు చ‌ర్చ‌.Pawan Kalyan Done Photoshoot For Janasena  Partyత‌న‌కు దేశ‌, రాష్ట్ర భ‌విష్య‌త్తు ముఖ్య‌మ‌ని.. వాటి ప్ర‌యోజ‌నం కోసం ఎవ‌రితో క‌లిసి పోరాడ్డానికైనా సిద్ధం అని ఆనాడే చెప్పాడు ప‌వ‌న్. ఇప్పుడు బిజేపీ గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చిన హామీలు పూర్తి చేయ‌డం లేద‌ని.. వ‌చ్చే పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. అవిశ్వాసం ప్రతిపాదించేలా రాహుల్ గాంధీని కోర‌నున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇక జ‌న‌సేన పార్టీ ప‌నులు కూడా ఊపందుకుంటున్నాయి. తాజాగా ఈయ‌న పార్టీ కోసం తెల్ల దుస్తుల్లో ఓ ఫోటోషూట్ కూడా చేసాడు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చాయి. మార్చి 14న గుంటూరు జిల్లా మంగళగిరిలో జ‌న‌సేన ప్లీనరీ సమావేశాలు అత్యంత భారీ స్థాయిలో జరపబోతున్నారు. త‌న పార్టీని ఎన్నిక‌ల కోసం సిద్ధం చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్.Pawan Kalyan Done Photoshoot For Janasena  Partyఈ ప్లీనరీ సమావేశాలకు దాదాపు 5 లక్షల మంది జనాన్ని సమీకరించాలని పవన్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలుస్తుంది. ఈ స‌మావేశాల్లోనే త‌న ల‌క్ష్యాలేంటో.. పార్టీ విధానాలేంటో పూర్తిగా జ‌నానికి అర్థ‌మ‌య్యేలా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌వ‌న్. జ‌న‌సేన పార్టీ కోసం పాట‌లు కూడా రాయించుకుంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. దీనికోసం తెలంగాణ, ఆంధ్రా మేధావుల‌తో క‌లిసి కూర్చుంటున్నాడు. ప‌వ‌న్ పార్టీ పాట‌ల‌కు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అందరి ఊహలకు షాక్ ఇస్తూ పవన్ అత్యంత హడావిడిగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్లీనరీ సమావేశాలు వెనుక ఒక ప్రముఖ రాజకీయ శక్తి హస్తం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌ట్లో ప‌వ‌న్ నుంచి సినిమాలు ఆశించ‌డం క‌ష్ట‌మే. అందుకే ఈ ప్లీన‌రీ స‌మావేశాలు కూడా ఫ్యాన్స్ కోస‌మే అని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ప‌వ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments