రేణుదేశాయ్ మ‌ళ్లీ ప్రేమలో పడింది

Last Updated on by

ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో విడిపోయిన త‌ర్వాత ఏడేళ్లుగా ఒంటరిగానే ఉంది రేణుదేశాయ్. త‌న పిల్ల‌ల్ని చూసుకుంటూ వాళ్లే ప్ర‌పంచంగా బ‌తికేస్తుంది ఈమె. త‌న‌కు స‌రైన వాడు దొరికితే.. న‌చ్చిన వాడు ఉంటే.. అర్థం చేసుకునే వాడు వ‌స్తే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాన‌ని ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది రేణు. ఇప్పుడు అదే ప‌నిమీద ఉంది. త‌న‌కు న‌చ్చిన‌వాడు దొరికేసిన‌ట్లే ఉన్నాడు. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో చూసి ఇప్పుడు అభిమానులు షాక్ అవుతున్నారు. రేణుదేశాయ్ కు తోడు దొరికింది.. త‌న‌కు జీవిత భాగ‌స్వామి దొరికాడంటూ ఓ లెట‌ర్ కూడా రాసింది ప‌వ‌న్ మాజీ భార్య‌. ఈ ఫోటోలో ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకుని ఉంది.

నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా అంటూ కవిత కూడా రాసి పోస్ట్ చేసింది రేణు. నీలో నా ప్రేమ దొరికింది అని నీతో ఉంటే చాలా సంతోషంగా.. శాంతంగా ఉంటాను.. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ వ‌ద‌ల‌కు.. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు అని ఆ వ్యక్తి గురించి రేణుదేశాయ్ రాసింది. అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్వాత అఫీషియ‌ల్ గా రేణుదేశాయ్ మ‌రో వ్య‌క్తి ని పెళ్లి చేసుకోబోతుంద‌ని అర్థ‌మైపోయింది. ఈమె పోస్ట్ పై కొంద‌రు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇప్ప‌టికైనా మీకు స‌రైన ప్రేమ దొరింకిందంటూ కొంద‌రు అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప‌వ‌న్ తో జానీ టైమ్ లో ప్రేమ‌లో ప‌డిన రేణు.. ఆ త‌ర్వాత కొన్నేళ్లు స‌హ‌జీవ‌నం చేసి పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత ఏడేళ్ల కింద విడిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి అంటూ సంచ‌ల‌నానికి తెర‌తీసింది. త్వరలోనే అది ఎవరో చెప్తాను అంటోంది రేణుదేశాయ్.

User Comments