ప‌వ‌న్ ఫ్యాన్స్ ర‌చ్చ భ‌రించ‌గ‌ల‌డా?

Last Updated on by

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులా మ‌జాకానా? జ‌న‌సేనాని ఎక్క‌డ ఉంటే అక్క‌డ ఒక‌టే సంద‌డి సంద‌డిగా ఉంటోంది. ఫంక్ష‌న్ల వేళ‌ ప‌వ‌న్ అభిమానుల ర‌చ్చ మామూలుగా ఉండ‌ద‌న్న‌ది తెలిసిన సంగ‌తే. ఆ క్ర‌మంలోనే నేటి సాయంత్రం బ‌న్ని వేడుక ఎలా సాగ‌బోతోంది? అక్క‌డ ఏదైనా గ‌డ‌బిడ ఉంటుందా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు జ‌నం. అస‌లింత‌కీ మ్యాటరేంటి? అంటే.. వివ‌రంలోకి వెళ్లాల్సిందే.

నేడు 7పీఎం `నా పేరు సూర్య` థాంక్స్ మీట్ హైద‌రాబాద్‌ తాజ్ డెక్క‌న్‌లో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్ని- వ‌క్కంతం- అల్లు అర‌వింద్ స‌హా ప‌లువురు అతిధుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ వేదిక‌పై ఓ సునామీకి కుర్చీ వేయ‌బోతున్నారు. ఆ సునామీ ఆ కుర్చీలో ఎలా ప‌డుతుందా? అని అభిమానుల్లో ఒక‌టే కంగారు.. క‌ల‌వ‌రం. ఇంత‌కీ ఎవ‌రా సునామీ అంటే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ వేదిక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాబోతున్నారు. ఈ విష‌యం ముందే తెలిసినా.. తెలియ‌నిది వేరొక‌టి ఉంది. బ‌న్ని ఈవెంట్ అయినా ఈ వేదిక‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు భారీగా త‌ర‌లి రానున్నార‌ని తెలుస్తోంది. ఎలానూ ప‌వ‌న్ తెలంగాణ‌లోనూ రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు కాబ‌ట్టి ఇక్క‌డ జ‌న‌సేనాని అభిమానులు, లోక‌ల్ కేడ‌ర్‌, లీడ‌ర్లు ఈ ఈవెంట్‌ని చుట్టుముట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది ఈవెంట్‌కి విచ్చేస్తార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ అంటే పిలుపు అఖ్క‌ర్లేదు. అత‌డి అభిమానులు భారీగా పోటెత్తుతార‌న‌డంలో సందేహ‌మే లేదు. అయితే తాజ్ డెక్క‌న్ లో ప‌వ‌న్ అభిమానుల్ని కాచేదెవ‌రో?  వీళ్ల‌కు బ‌న్ని ఫ్యాన్స్ యాడ‌యితే ఆ మ‌జా ఎలా ఉంటుందో? అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది. `చెప్ప‌ను బ్ర‌ద‌ర్` అని తాజ్ డెక్క‌న్ వాళ్లు అంటే కుద‌ర‌దు.. వ‌చ్చేది ప‌వ‌ర్ ఫ్యాన్స్ కం స్టైలిష్ ఫ్యాన్స్‌. ఉరుమెళ్లి మెరుపు మీద ప‌డ్డ‌ట్టు.. మెరుపొచ్చి క‌రెంటు తీగ‌ల మీద ప‌డ్డ‌ట్టు ఉంటుంది అక్క‌డ సీను! త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!

User Comments