లీగ‌ల్ నోటీసులు సిద్ధం

Last Updated on by

యుద్ధం చేయాల‌ని ఫిక్స్ అయిన త‌ర్వాత యుద్ధం చేయ‌డ‌మే త‌రువాయి. ముందు వెన‌క ఏం జ‌రుగుతుంద‌ని చూస్తూ కూర్చుంటే ఏదీ ముందుకు వెళ్ల‌దు. ఇప్పుడు ప‌వ‌న్ ఇదే చేస్తున్నాడు. యుద్ధం చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు దాంతో అదే ప‌నిగా ముందుకెళ్తున్నాడు. సైన్యం ఉందా లేదా అని కూడా చూసుకోవ‌డం లేదు ప‌వ‌ర్ స్టార్. త‌న వెంట వ‌చ్చే వాళ్లు రానీ.. రాక‌పోతే పోనీ అంటున్నాడు ఈయ‌న‌. తాను మాత్రం చేయాల‌నుకున్న‌ది చేసి కానీ వెన‌క్కి వెళ్ల‌నంటున్నాడు ఈ హీరో. ఇప్పుడు మీడియాపై ప‌వ‌న్ సంచ‌ల‌న యుద్ధానికి తెర‌తీసాడు. ప్ర‌త్యేకంగా టివి 9, ఏబిఎన్, మ‌హాటీవీ లాంటి వాళ్ళ పేర్లు పెట్టి మ‌రీ ర‌చ్చ చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. దాంతో ఇప్పుడు అక్క‌డి నుంచి కూడా లీగ‌ల్ నోటీసు ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు మీడియా పెద్ద‌లు. టివి 9 శ్రీ‌నిరాజుతో పాటు ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ప‌వ‌న్ పై 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావాతో పాటు లీగ‌ల్ నోటీస్ కూడా ఇవ్వాల‌ని చూస్తున్నారు.

నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసినందుకు కానీ ప‌వ‌న్ ఖచ్చితంగా న్యాయ‌బ‌ద్ధంగా పోరాటానికి సిద్ధం కావాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు వాళ్లు. దానికి ప‌వ‌న్ కూడా సై అంటున్నాడు. త‌న న్యాయ‌వాదుల‌కు అన్ని విష‌యాలు చెప్పానని.. అంద‌రి తాట తీయ‌డానికే తాను ఇప్పుడు రంగంలోకి దిగిన‌ట్లుగా ప‌వ‌న్ చెబుతున్నాడు. ఇన్నాళ్లూ రేటింగుల కోసం గేమ్ ఆడితే ఎలా ఉంటుందో మీరు చూపించారు క‌దా.. మీరు ఆడిన షోకు అమ్మ‌లాంటి షో నేనుమీకు చూపిస్తానంటూ స‌వాల్ చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. గ‌త కొన్ని రోజులుగా ఆ ఛానెల్స్ లో ప‌వ‌న్ పై రెగ్యుల‌ర్ గా కొన్ని ప్రోగ్రామ్ లు.. డిబేట్లు న‌డిచాయి. ఇదే సాక్ష్యంగా న్యాయ పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి ప‌వ‌న్ చేస్తోన్న ఈ పోరాటం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కూడా క‌ల‌క‌లం రేపుతుంది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

User Comments