అభిమానుల ఒళ్లు పుల‌క‌రించిపోవ‌డం ఖాయం

Pawan Kalyan Mahesh Babu old Photo

ఈ ఫోటో చూస్తుంటే అభిమానుల ఒళ్లు పుల‌క‌రించిపోవ‌డం ఖాయం. మా హీరో గొప్పంటే కాదు.. మా హీరోనే గొప్ప అని కాల‌ర్ ప‌ట్టుకునే ఫ్యాన్స్ కు ఈ ఫోటో ఓ తీపిగుర్తు. హీరోలంతా ఒక్క‌టే.. అభిమానులు కూడా ఒక్క‌టిగా ఉండండి అని చెప్పే ఫోటో ఇది. ప‌వ‌న్, మ‌హేశ్ కెరీర్ ఆల్ మోస్ట్ ఒకేసారి మొద‌లయ్యాయి. ప‌వ‌న్ కాస్త సీనియ‌ర్ అంతే.

పైన చూస్తోన్న ఈ ఫోటో బ‌ద్రి సినిమా ఓపెనింగ్ టైమ్ లోది. అప్పుడు చిరంజీవితో పాటు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా ఈ ఓపెనింగ్ కు వ‌చ్చారు. ఏళ్లు గ‌డిచేకొద్ది.. మ‌హేశ్, ప‌వ‌న్ ఇమేజ్ కూడా అనుభవంతో పాటే పెరుగుతూ వ‌చ్చింది. ఇప్పుడు వాళ్లు అభిమానుల పాలిట దేవుళ్లుగా మారిపోయారు. ఇక బాక్సాఫీస్ కు య‌ముళ్లే. వీళ్ల సినిమాల‌కు పాజిటివ్ టాక్ రావాలే కానీ దుమ్ము దులిపేస్తాయి. ఏదేమైనా ఈ ఫోటో అభిమానుల మ‌న‌సుల్ని 20 ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లిపోయింది.