ప‌వ‌న్-మ‌హేష్ వార్ 2019 ఎన్నిక‌ల్లో

Last Updated on by

అదేంటి.. త‌న‌కు అస‌లు రాజ‌కీయాలే ప‌డ‌వ‌న్నాడు.. జీవితంలో పాలిటిక్స్ వైపు వెళ్ల‌న‌న్నాడు క‌దా అప్పుడే మ‌హేష్ మ‌ళ్లీ రాజ‌కీయాల వైపు వ‌స్తున్నాడా అనుకుంటున్నారా..? ఏమో జింద‌గీ ఎప్పుడు ఎవ‌ర్ని ఎక్క‌డ ఎలా మారుస్తుందో తెలియ‌దు. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా రాజ‌కీయాల వైపు వ‌స్తాడేమో..! దానికి కొన్ని ప‌రిస్థితులు దారి తీస్తాయేమో..? ఈ క‌థ అంత‌టికి తెర‌వెన‌క హీరో గ‌ల్లా జ‌య‌దేవ్. బావ ఆఫ్ మ‌హేష్. బావ కోసం మ‌హేష్ రాజ‌కీయాల్లో ప్ర‌చారం చేసినా చేసేలా క‌నిపిస్తున్నాడు. ఇదే జ‌రిగితే 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కు వ్య‌తిరేకంగా మ‌హేష్ వార్ కు దిగిన‌ట్లే.

నేరుగా ప్ర‌చారం అవ‌స‌రం లేదు.. బావ‌కు స‌పోర్ట్ గా సోష‌ల్ మీడియాలో స‌పోర్ట్ చేసినా చాలు ప‌వ‌న్ కు ఆపోజిట్ గా సూప‌ర్ స్టార్ రంగంలోకి దిగిన‌ట్లే. ఎందుకంటే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ ఫాలోయింగ్ ఉన్న హీరో మ‌హేష్. సౌత్ ఇండియాలోనే ఈయ‌న‌కు ఉన్నంత ఫాలోయింగ్ మ‌రో హీరోకు లేదు. దాంతో బావ క‌ళ్ళ‌లో ఆనందం కోసం 2019 ఎన్నిక‌ల్లో టిడిపి త‌ర‌ఫున కాక‌పోయినా.. బావ త‌ర‌ఫున పర్స‌న‌ల్ గా తీసుకుని మ‌హేశ్ త‌న అభిమానుల‌కు పిలుపు ఇచ్చినా కూడా అది రాజ‌కీయ ప్ర‌చార‌మే అవుతుంది. మ‌రి.. ఇన్నాళ్లూ సినిమాల్లో ఇద్ద‌రూ పోటీ ప‌డితే ఎలా ఉంటుందో చూసాం.. రేపు ఎన్నిక‌ల్లో కానీ పోటీ ప‌డితే ఆ పోరు ర‌స‌వ‌త్త‌రంగా కాదు.. రంజుగా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

User Comments