పవన్ కళ్యాణ్: మార్పు మంచిదే.. కానీ?

Last Updated on by

రాజ‌కీయాల్లో ఉన్నాడు క‌దా.. ఇచ్చిన మాట మీద నిల‌బ‌డ‌టం త‌ప్పు అని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. అక్క‌డ హామీలు ఇవ్వ‌డం వ‌ర‌కే క‌దా.. తీర్చేవాళ్లు చాలా త‌క్కువ‌. ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఈయ‌న సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వెళ్లాడు. ఇక్క‌డ ఉన్న‌పుడు ప‌వ‌న్ మాటంటే. ఖచ్చితంగా తీర్చేవాడు. కానీ పాలిటిక్స్ లోకి వెళ్లిన త‌ర్వాత ప‌వ‌న్ కూడా మాట‌మీద నిల‌బ‌డ‌టం మానేసాడు. చెప్పింది చేయ‌ట్లేదు.. చేసేది చెప్ప‌ట్లేదు.. చెప్పిందే చేస్తాడ‌ని క్లారిటీ ఇవ్వ‌ట్లేదు. ఇప్పుడు ఈ మ్యాట‌ర్ అంతా ఎందుకంటే ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమా చేస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. అవును.. ప‌రిస్థితులు చూస్తుంటే త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ స్టార్ సినిమా చేయ‌బోతున్నాడు పవ‌న్ క‌ళ్యాణ్.

పైగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న గ‌త సినిమా అజ్ఞాత‌వాసి ఎంత పెద్ద డిజాస్ట‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రం తీసుకొచ్చిన న‌ష్టాలు చూస్తుంటేనే బ‌య్య‌ర్ల‌కు భయ‌మేస్తుంది. దాదాపు 60 కోట్ల‌కు పైగానే ముంచేసాడు అజ్ఞాత‌వాసి. ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక సినిమాలు చేయ‌డనే ప్ర‌చారం గ‌ట్టిగానే జ‌రుగుతుంది. కానీ ఒక్క సినిమా మాత్రం చేస్తాడు. అది కూడా మైత్రి మూవీ మేక‌ర్స్ కు. ఇది ఎప్పుడో ఇచ్చిన క‌మిట్మెంట్ కాబ‌ట్టి ప‌వ‌ర్ స్టార్ ఈ సినిమా పూర్తి చేస్తాడ‌ని తెలుస్తుంది. అది కూడా ఎన్నిక‌ల‌కు ముందే. ముందు అస‌లు ఎన్నిక‌ల వ‌ర‌కు ఏ సినిమా చేయ‌కూడ‌ద‌నే అనుకున్నాడు కానీ అజ్ఞాత‌వాసి ఫ్లాప్ అవ్వ‌డంతో ఎన్నిక‌ల‌కు ముందు పాజిటివ్ వైబ్రేష‌న్స్ కోసం ఓ సినిమా చేయాల‌ని చూస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్.

అది కూడా ప‌క్కా యాక్ష‌న్ క‌థ‌. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ అయితే ప్రేక్ష‌కుల‌కు ఈజీగా రీచ్ అవుతుంద‌ని భావిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ నుంచి మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి కేవ‌లం 43 రోజులు మాత్ర‌మే కాల్షీట్స్ ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రం త‌మిళ్ హిట్టైన తెరీ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తుంది. ఇప్ప‌టికే వీర‌మ్ సినిమాను తెలుగులో వ‌చ్చినా కూడా కాట‌మ‌రాయుడు అంటూ రీమేక్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్పుడు పోలీసోడుగా వ‌చ్చిన తెరీని మ‌ళ్లీ రీమేక్ చేస్తానంటున్నాడు. అది కూడా 43 రోజుల కాల్షీట్స్ తో. మ‌రి ఇది ఎలా ఉండ‌బోతుందో..? అన్నీ కుదిర్తే ఈ ఏడాది ద‌స‌రా లోపు ఈ చిత్రం పూర్తి చేయాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తుంది. ఇప్ప‌టి కైనా తెలిసిందా.. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎంత మారిపోయాడో..?

User Comments