జ‌న‌సేనాని సినిమాలు బ్యాన్!

Last Updated on by

ఏపీలో ఎన్నిక‌ల వేడి మాములుగా లేదు. జ‌న‌సేన‌, వైసీపీ, టీడీపీ ల‌మ‌ధ్య త్రిముఖ పోరు కొన‌సాగుతోంది. గెలుపు గుర్రం నీదా? నాదా? అంటూ స‌వాల్ విసురుకుని మ‌రీ పోటీ బ‌రిలో దిగారు. ఎన్న‌డు లేని రాజ‌కీయ స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయ‌ని తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. ఇప్ప‌టికే నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ సినిమాలు బ్యాన్ చేయ‌డానికి ఈసీ రంగం సిద్దం చేస్తున్నట్లు స‌మాచారం. అజ్ఞాత వాసి త‌ర్వాత ప‌వ‌న్ బిగ్ స్ర్కీన్ సినిమ‌ల‌కు గుడ్ బై చెప్పేసినా? టివీల్లో మాత్రం ఆయ‌న దూకుడు కొన‌సాగుతూనేంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ సినిమాలు టీవీల్లో ఆడితే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని అధికారులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ ఆయ‌న సినిమాల‌ను బ్యాన్ చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఉప్పందింది. ఇప్ప‌టి క‌ర్ణాట‌క‌లో మాండ్య నియోజిక వ‌ర్గం నుంచి పోటీ ప‌డుతోన్న న‌టి సుమ‌ల‌త‌, యువ న‌టుడు నికిల్ సినిమాల‌ను బ్యాన్ చేసారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ సినిమాల‌పైనా వేటు ప‌డ‌టం కాయ‌మ‌నిపిస్తోంది. దీనికి సంబంధించి అతి త్వ‌ర‌లోనే అధికారుల నుంచి నోటీసులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాగే బాల‌కృష్ణ‌, ఇత‌ర సెల‌బ్రిటీల సినిమాల‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవ‌కాశం ఉందని వినిపిస్తోంది.

User Comments