ప‌వ‌న్ అస‌లు ప‌ట్టించుకోడా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంతే.. ఆయ‌న ఒక్క‌సారి ఫిక్సైతే కొంత‌కాలం ఆయ‌న మాట ఆయ‌నే విన‌డు. ప్ర‌స్తుతం అదే ప‌రిస్థితుల్లో ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. ఈయ‌న ఇప్పుడు హీరో కాదు.. పూర్తిస్థాయి రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న చేస్తున్న‌దంతా ఇప్పుడు ప్ర‌జ‌ల కోస‌మే. సినిమాల వైపు వ‌చ్చేలా కూడా ఇప్పుడు క‌నిపించ‌ట్లేదు. అస‌లు సినిమా అంటే ఏంటి అనేంత అమాయ‌కంగా ఫేస్ పెడుతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇలాంటి స‌మ‌యంలో ఈ హీరో నుంచి మ‌రో సినిమా ఊహించ‌డం అయితే ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. అస‌లు సినిమాల గురించి అడుగుతున్నా కూడా తాను ఇప్పుడు ప్ర‌జ‌ల్లోనే ఉన్నానంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. సినిమాలతో ప్ర‌జ‌ల్లోకి రావ‌డం కంటే ఇలా ఉండ‌ట‌మే త‌న‌కు ఆనందాన్ని ఇస్తుందంటున్నాడు ప‌వ‌ర్ స్టార్.

ప‌వ‌న్ తీరు చూస్తుంటే అస‌లు మైత్రి మూవీ మేక‌ర్స్ తో చేయాల్సిన సినిమాను కూడా పూర్తిగా ఆపేసిన‌ట్లుగానే అనిపిస్తుంది. మ‌రి వాళ్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాడా లేదంటే ఎప్ప‌ట్లాగే ఆస‌క్తి లేకుండా సినిమా చేసి చేతులు కాల్చుకుంటాడా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ట్విస్ట్ ఏంటంటే ప‌వ‌న్ కోసం ఎన్నేళ్లైనా వేచి చూస్తామంటూ మైత్రి అధినేత న‌వీన్ యెర్నేని చెబుతుండ‌టం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో విభేధాలున్నాయ‌ని వ‌స్తోన్న వార్త‌ల్ని ఈయ‌న ఖండిస్తున్నాడు. ఆయ‌న ఎప్పుడు సినిమా చేస్తే అప్పుడే చేస్తాం కానీ అడ్వాన్స్ విష‌యంలో వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అబ‌ద్ధ‌మే అంటున్నాడు న‌వీన్. మ‌రి.. ప‌వ‌న్ మ‌న‌సు మారుతుందో.. లేదంటే పూర్తిగా రాజ‌కీయాల‌కు ప‌రిమితం అయిపోతాడో..?

User Comments