ప‌వ‌న్ ఒక్క రోజు.. వాళ్ల‌కు లైఫ్ టైమ్..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ గురించి.. క్రేజ్ గురించి.. మార్కెట్ గురించి ఇప్పుడు కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. ఆయ‌న అడుగేస్తే రికార్డులు అలా న‌డుస్తూ వ‌చ్చేస్తాయి. ఆయ‌న కానీ కాన్స‌ట్రేష‌న్ పెట్టి సినిమాలు చేసాడంటే ఒక్క రికార్డు కూడా ఉండ‌దు. కానీ ఏం చేస్తాం.. కామెడీ కోసం సినిమాలు చేస్తుంటాడు ప‌వ‌ర్ స్టార్. త‌న స‌ర‌దా కోసం బ‌య్య‌ర్ల‌ను భ‌య‌పెడుతుంటాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ ఏంటి.. అత‌డి రేంజ్ ఏంటి అనేది అజ్ఞాత‌వాసి మ‌రోసారి నిరూపించింది. ఈ సినిమా తొలిరోజు డిజాస్ట‌ర్ టాక్ తో ఓపెన్ అయింది. కానీ తొలిరోజే 40 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇది నాన్ బాహుబ‌లి రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లోనూ 27 కోట్ల షేర్ వ‌సూలు చేసింది అజ్ఞాత‌వాసి. ఖైదీ నెం.150 పేరు మీదున్న 23 కోట్ల షేర్ రికార్డును త‌మ్ముడు అందుకున్నాడు. మూడున్న‌ర కోట్ల భారీ మార్జిన్ తో చిరంజీవిని వెన‌క్కి నెట్టేసాడు ప‌వ‌ర్ స్టార్.
అజ్ఞాత‌వాసికి టాక్ మాత్రం తేడాగా ఉండ‌టంతో ఓపెనింగ్స్ తోనే ఈ రికార్డులు ఆగిపోయేలా క‌నిపిస్తున్నాయి. అయినా కూడా తొలిరోజు ప‌వ‌న్ సాధించిన 40 కోట్ల షేర్ చాలా సినిమాల‌కు లైఫ్ టైమ్ షేర్. ఎన్టీఆర్ న‌టించిన టెంప‌ర్ లైఫ్ టైమ్ షేర్ ఇది.. ఇక లెజెండ్ లాంటి సినిమాలు కూడా లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్లు 40 కోట్లే. వాళ్ల‌కు తోడు రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌కు కూడా ఈ క‌లెక్ష‌న్లు లైఫ్ టైమ్ వ‌సూళ్లే. అంటే ఆ హీరోల లైఫ్ టైమ్ వ‌సూళ్లు ప‌వ‌న్ తొలిరోజుకు స‌మానం. దాన్ని బ‌ట్టే అర్థ‌మ‌వుతుంది ప‌వ‌ర్ స్టార్ ఇమేజ్ ఏంట‌ని..? కానీ ఏం చేస్తాం.. ఈయ‌న‌కు సినిమాల‌పై ఆస‌క్తి లేదు. అది అభిమానుల దుర‌దృష్టం అనుకోవాలో.. ఇండ‌స్ట్రీ చేసుకున్న పాపం అనాలో అర్థం కావ‌డం లేదు. మొత్తానికి ఇప్పుడు అజ్ఞాత‌వాసి ప్ర‌యాణం ఎంత‌వ‌ర‌కు వ‌చ్చి ఆగుతుందో..?