ప‌వ‌న్ క‌ల్యాణ్ రీలాంచ్ డేట్

Pawan Kalyan - File Photo

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు కామా పెట్టి తిరిగి సినిమాలు చేస్తార‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దీనిపై ప‌వ‌న్ ఇంత‌వ‌ర‌కూ పెద‌వి విప్ప‌లేదు. ఆ క్ర‌మంలోనే బోనిక‌పూర్ – దిల్ రాజు బృందం పింక్ రీమేక్ కోసం సంప్ర‌దించార‌ని వార్త‌లొచ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ రీమేక్ కి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ఈ రెండు వారాల్లోనే సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ స్వ‌యంగా ట్వీట్ చేయ‌డంతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

మ‌రోవైపు ప‌వ‌న్ తో సినిమా చేసేందుకు క్రిష్ .. సురేంద‌ర్ రెడ్డి లాంటి ద‌ర్శ‌కులు క‌థ‌లు రాస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఏ.ఎం.ర‌త్నం.. మైత్రి మూవీ మేక‌ర్స్ కి ప‌వ‌న్ సినిమాలు చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం వీళ్లంతా క‌థ‌లు వండి వార్చి ప‌వ‌న్ ని ఒప్పించే ప‌నిలో ఉన్నారు. అయితే ఏది ముందు ఏది వెన‌క‌? అస‌లు ప‌వ‌న్ అంగీక‌రించారా లేదా? అన్న‌ది ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డితే కానీ క‌న్ఫామ్ చేయ‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతానికి పింక్ రీమేక్ వేణు శ్రీ‌రామ్ తో ఉంటుంద‌న్న‌ది గ‌ట్టిగా వినిపిస్తోంది.