ప‌వ‌న్ మార్ష‌ల్ ఆర్స్ట్ సీక్రెట్ లీక్

ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు దూరంగా రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల త‌ర్వాతైనా ప‌వ‌న్ సినిమాలు చేస్తారా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ ఆయ‌న చేస్తోన్న కార్య‌క్ర‌మాలు చూస్తుంటే ప‌వ‌న్ శాశ్వ‌తంగా సినిమాల‌కు దూర‌మైనట్లే క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు ముగిసినా త‌న బృంద‌మంతా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే ప‌నిచేస్తోంది. తాజాగా ప‌వ‌న్ ఓ టాప్ సీక్రెట్ ను లీక్ చేసారు. అభిమానుల్లో ప‌వ‌న్ ఎందుకు మార్ష‌ల్ ఆర్ట్స్‌ ప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యారు అనే ఓ సందేహం ఉంది. తాజాగా ఆ సందేహాన్ని ప‌వ‌న్ నివృతి చేసారు.

నాగ‌బాబు క‌రాటే నేర్చుకుంటే ప‌వ‌న్ వెట‌కారం చేసేవాడుట‌. బ్రూస్లీ సినిమాలు చూసినా ప‌వ‌న్ కు ఏమీ అనిపించేది కాదుట‌. అలాంటి విద్య‌లు వాళ్ల‌కొస్తాయి గానీ, మ‌న‌కెంద‌కు వ‌స్తాయి అని అపోహ‌లో ఉండేవాడుట‌. అయితే కాలేజీకి వెళ్లే స‌మ‌యంలో గొడ‌వ‌లు ఎక్కువ అయ్యేవ‌ట‌. చిరంజీవి సినిమాల‌ను వెక్కిరిస్తూ గొడ‌వ పెట్టుకోవ‌డానికి ఎవ‌రో ఒక‌రు రెడీగా ఉండేవారుట‌. మంద్రాసులోనూ అలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. కోపం వ‌చ్చి కొట్టాల‌నిపించినా బ‌లంగా లేక‌పోవ‌డం వ‌ల్లే వెన‌క్కి త‌గ్గేవాడుట‌. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోలేక‌పోతే ఎలా? కోపాన్ని కంట్రోల్ చేసుకునే సామ‌ర్ధ్యం లేన‌ప్పుడు. అప్పుడే మార్ష‌ల్ ఆర్స్ట్ ఆలోచ‌న త‌ట్టిందిట‌. మార్ష‌ల్ ఆర్స్ట్ కోపాన్ని కంట్రోల్ చేసుకునే శ‌క్తినిస్తుంది. ఆ విద్య నేర్చుకున్నంత మాత్రాన‌ గొడ‌వ‌లు జరిగితే కొట్టేస్తామ‌ని కాదు. ఆ ప‌రిస్థితిని చూసే విధానంలో మార్పు తీసుకొస్తుంది. అందుకే మార్ష‌ల్ ఆర్ట్స్‌ నేర్చుకున్నాన‌ని ప‌వ‌న్ తెలిపారు.