చ‌ర‌ణ్ అవ‌స‌రం లేదంటోన్న ప‌వ‌న్

Last Updated on by

బాబాయ్ అడ‌గాలే కానీ సినిమాలు కూడా మానేసి ఆయ‌న‌తో న‌డ‌వ‌డానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈ మ‌ధ్యే ప్ర‌క‌టించాడు రామ్ చ‌ర‌ణ్. ప్ర‌జారాజ్యం టైమ్ లోనే తాను చిన్న‌వాడిన‌ని వ‌ద్ద‌న్నార‌ని.. ఇప్పుడు ఎవ‌రి మాటా వినేది లేద‌న్నాడు చ‌ర‌ణ్. అయితే ఈ విష‌యంపై ప‌వ‌న్ స్పందించాడు. త‌న‌కి ఎవ‌రి సాయం అవ‌స‌రం లేద‌ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు. ఇప్పుడు తాను ప‌డుతున్న క‌ష్టం చాల‌ని.. పిల్ల‌లు కూడా అవ‌స‌రం లేద‌న్నాడు ప‌వ‌ర్ స్టార్. తానేమీ ఇక్క‌డ సుఖ‌ప‌డ‌టం లేద‌ని.. ఎండ‌ల్లో ఇంతగా తిర‌గ‌డం త‌న కుటుంబానికి అవ‌స‌రం లేద‌ని.. ఆ క‌ష్ట‌మేదో తానే ప‌డ‌తాన‌ని.. వాళ్లు వ‌స్తామ‌ని అడిగినా కూడా ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాలంటూ చెప్తానంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. దీన్నిబ‌ట్టే చూస్తుంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవ‌ర్నీ క‌నీసం జ‌న‌సేన వైపు న‌డిపించేలా క‌నిపించ‌ట్లేదు ప‌వ‌ర్ స్టార్. రామ్ చ‌ర‌ణ్ కు కూడా సుతిమెత్త‌గా వ‌ద్ద‌నే స‌మాధాన‌మే చెప్పాడు బాబాయ్. మ‌రి.. దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో..? ప‌వ‌న్ కు స‌పోర్ట్ గా వాళ్లు కూడా న‌డుస్తారో లేదో..?

User Comments