ప‌వ‌న్ కు అకీరా ప‌ర్మినెంట్ కాదు

Last Updated on by

అదేంటి వార‌సుడు తండ్రికి ప‌ర్మినెంట్ కాక‌పోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు అకీరా విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ‌లో క‌నిపిస్తున్నాడు అకీరా నంద‌న్. అది చూసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు తెగ ఆనంద‌ప‌డిపోతున్నారు. మెగా ఫ్యామిలీలో మ‌రో వార‌సుడు వ‌చ్చాడు.. ప‌వ‌న్ వార‌స‌త్వాన్ని తీసుకుంటాడు అని క‌ల‌లు కంటున్నారు. విజ‌య‌వాడకు కూడా వ‌చ్చాడంటే ఇక ఇక్క‌డికి షిఫ్ట్ అయిపోయిన‌ట్లే అనే వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ వాళ్ల క‌ల‌ల‌కు రేణుదేశాయ్ బ్రేకులు వేసింది.

అకీరా విజ‌య‌వాడకు ఏం షిఫ్ట్ కాలేద‌ని.. హాలీడేస్ ఉన్నాయి కాబ‌ట్టి కొన్ని రోజులు అలా వ‌చ్చాడంతే.. అవి పూర్తి కాగానే మ‌ళ్లీ పూణే వ‌చ్చేస్తాడంటూ స‌మాధానం ఇచ్చింది. రేణు స‌మాధానంతో మెగా ఫ్యాన్స్ ఒక్క‌సారిగా నిట్టూర్చారు. దానికితోడు ఈ మ‌ధ్యే ప‌వ‌న్ వార‌సుడు… జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ అంటూ అకీరాను పిల‌వ‌డం కూడా త‌న‌కు.. అకీరాకు.. ప‌వ‌న్ కు కూడా న‌చ్చ‌ట్లేద‌ని ఫ్యాన్స్ కు గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అలా పిలిచిన వాళ్ల‌ను బ్లాక్ చేస్తాన‌ని కూడా చెప్పింది రేణుదేశాయ్. మొత్తానికి వార‌సుడి విష‌యంలో ప‌వ‌న్ కంటే రేణునే ఎక్కువ‌గా దృష్టి పెట్టింద‌న్న‌మాట‌.

User Comments