పవన్ ప్రసాద్ ల్యాబ్ లో ఏం చేస్తున్నాడు?

టైమ్ మేనేజ్ మెంట్ క్లాసులు చెప్ప‌డానికి ప‌వన్ ను కానీ పంపిస్తే అన్నీ ప‌ర్ ఫెక్ట్ గా మేనేజ్ చేసి వ‌స్తాడు ప‌వ‌ర్ స్టార్. లేక‌పోతే మ‌రేంటి.. మొన్న‌టి వ‌ర‌కు అజ్ఞాత‌వాసి ప‌నిలో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇలా పూర్త‌యిందో లేదో అప్పుడే రాజ‌కీయాలంటూ జ‌నాల మ‌ధ్య‌లోకి వెళ్లాడు. ఇప్పుడు మ‌ళ్లీ సినిమా ప‌నుల కోసం ఇక్క‌డికి వ‌చ్చేసాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఉన్నాడు. అది కూడా ప్ర‌సాద్ డ‌బ్బింగ్ థియేట‌ర్లో. అవును.. అజ్ఞాత‌వాసి డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఈ చిత్ర ఔట్ పుట్ బ్ర‌హ్మాండంగా వ‌చ్చింద‌ని తెలుస్తుంది.

ఈ చిత్రంతో క‌చ్చితంగా ప‌వ‌న్ ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేస్తాడ‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. ప‌వ‌న్ ఈ రికార్డులు బ‌ద్ద‌లుకొడితే ముందుగా పగిలేది అన్న‌య్య రికార్డులే. ఖైదీ నెం.150తో ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చినా కూడా రికార్డులు తిర‌గ‌రాసాడు మెగాస్టార్. ఆయ‌న పేరుమీదే ఇప్పుడు 104 కోట్ల రికార్డ్ ఉంది. ఈ లిస్ట్ లో బాహుబ‌లి అద‌నం. అది కాకుండా రెండో రికార్డు కోసమే ఇక్క‌డ పోటీ. ఇప్పుడు దానికోస‌మే ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. మొత్తానికి అజ్ఞాత‌వాసి డ‌బ్బింగ్ మ‌రో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఈ నెల‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి కానుంది.