యావ‌రేజ్ తో మొద‌లు.. ప్లాపుతో ముగింపు..

Last Updated on by

ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ ఇదే. సినిమాలు చేస్తాడు.. ఇప్పుడు కాక‌పోయినా మ‌రో టైమ్ లో ప‌వ‌ర్ స్టార్ ను తెర‌పై చూడొచ్చు అని కోరుకుంటున్న అభిమానుల‌కు పెద్ద షాక్ ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్. ఇక‌పై తాను సినిమాలు చేయ‌బోన‌ని తేల్చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్పుడు త‌న‌కు అస‌లు సినిమాలు చేసే ఉద్దేశ్య‌మే లేద‌ని చెప్పేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాజాగా ఆయ‌న కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి సాక్షిగా రాజ‌కీయ యాత్ర మొద‌లుపెట్టాడు. తొలి విడ‌త‌లో తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో ఆయ‌న యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే త‌న రాజ‌కీయ కార్య‌చ‌ర‌ణ గురించి మాట్లాడాడు ప‌వ‌ర్ స్టార్. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

ఆయ‌న అన్నీ తానేయై కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడ‌ని చెప్పాడు.  ఇందులో భాగంగానే ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. ఇక‌పై తాను సినిమాలు చేయ‌బోన‌ని స‌మాధానం ఇచ్చాడు. ఇదే నిజ‌మైతే గ‌న‌క ప‌వ‌ర్ స్టార్ అద్భుత‌మైన సినిమా కెరీర్ డిజాస్ట్ర‌స్ ముగింపు ఇదే అవుతుంది. ఎందుకంటే ఆయ‌న తొలి సినిమా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి యావ‌రేజ్.. చివ‌రి సినిమా అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్. అది కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోయే అతి పెద్ద డిజాస్ట‌ర్. ఇలాంటి సినిమాతో ప‌వ‌న్ కెరీర్ ముగియ‌డం నిజంగా అభిమానుల‌కు ఇష్టం లేదు. ఇంకా ఒక్క సినిమా చేసి కెరీర్ కు బైబై చెప్పాల‌ని కోరుకుంటున్నారు వాళ్లు. హిట్ సినిమా వ‌స్తే ఇక సినిమాలు చేయ‌మ‌ని అడ‌గం అంటున్నారు అభిమానులు. కానీ ప‌వ‌న్ మాత్రం ఇప్పుడు వినే మూడ్ లో లేడు. మొత్తానికి ఓ యావ‌రేజ్ సినిమాతో కెరీర్ మొద‌లుపెట్టి.. ఫ్లాప్ సినిమాతో ముగించాడు ప‌వ‌ర్ స్టార్.

Follow US 

User Comments