ప‌వ‌న్ అను నేను అంటోన్న జ‌న‌సేనాని..!

Last Updated on by

అయిపోయింది.. ఇక సినిమాల‌తో ప‌వ‌న్ కు రుణం తీరిపోయింది. మ‌ళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తాడో తెలియ‌దు. ఇక‌పై ప‌వ‌ర్ స్టార్ అంటే హీరో కాదు.. రాజ‌కీయ నేత‌. ఈ జ‌న‌సేనాని జ‌నంలోకి వెళ్ల‌డానికి ఫిక్సైపోయాడు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు. జ‌న‌వ‌రి 22 ఉద‌యం 9 గంట‌ల‌కు కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి సాక్షిగా ఈయ‌న రాజ‌కీయ యాత్ర ప్రారంభం కానుంది. ఆ ప‌వ‌న పుత్రుడి ఆశీస్సుల‌తోనే ఈ ప‌వ‌నుడు జ‌నంలోకి వెళ్లిపోతున్నాడు. అక్క‌డ్నుంచే యాత్ర మొద‌లుపెట్ట‌డానికి కార‌ణాలు కూడా చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. 2009 ప్ర‌జారాజ్యం ఎన్నికల టైమ్ లో తాను అక్క‌డ ద‌ర్శించుకుని వ‌స్తున్న‌పుడే క‌రెంట్ షాక్ త‌గిలింద‌ని.. ఆ ఆంజ‌నేయ‌స్వామే త‌న‌ను కాపాడ‌డ‌ని న‌మ్ముతాన‌ని.. అందుకే భ‌విష్య‌త్తులో ఎప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా అక్క‌డ్నుంచే యాత్ర మొద‌లుపెడ‌తాన‌ని మొక్కుకున్నాన‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అందుకే కొండ‌గ‌ట్టు నుంచే త‌న యాత్ర ప్రారంభం కానుంద‌ని చెప్పాడు ఈ జ‌న‌సేనాని.

జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి గుడి నుంచే ప‌వ‌న్ యాత్ర మొద‌లు కానుంది. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత పూర్తిస్థాయి కార్య‌చ‌ర‌ణ ఎలా ఉంటుందో చెప్ప‌బోతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తెలంగాణ‌లోని మూడు జిల్లాల్లోని స‌మ‌స్య‌ల‌ను ముందుగా తెలుసుకోనున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆ త‌ర్వాత పూర్తిస్థాయి యాత్ర మొద‌లు కానుంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఈ యాత్ర అని చెబుతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. దాంతో పాటే త‌నకు బాగా జ‌నాద‌ర‌ణ‌ ఉన్న ప్రాంతాల మీదుగా ఈ యాత్ర జ‌ర‌గ‌నుంది. దీన్ని బ‌ట్టే ఆయా స్థానాల్లో ఎవ‌రెవ‌రికి సీట్లు ఇవ్వాల‌నే విష‌యంపై కూడా ప‌వ‌న్ ఓ క్లారిటీ తెచ్చుకోనున్నాడు.

రాజ‌కీయ యాత్ర త‌ర్వాత పాద‌యాత్ర కూడా ప్లాన్ చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. చ‌రిత్ర‌లో పాద‌యాత్ర చేసిన చాలా మంది నాయ‌కులు ఉన్న‌త ప‌దవుల్లోకి వెళ్లారు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా ఇదే దారిలో న‌డుస్తున్నాడు. ఎలాగూ రాజకీయ ప్ర‌యాణం మొద‌లైంది కాబ‌ట్టి ఇక‌పై సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాల‌ని ఫిక్స్ అయిపోయాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్ప‌ట్లో సినిమాలు చేసే ఉద్దేశం కూడా ప‌వ‌న్ లో క‌నిపించ‌ట్లేదు. మైత్రి మూవీ మేక‌ర్స్ కు ఇప్ప‌టికే ఓ సినిమా చేయాలి.. అయితే ఏఎం ర‌త్నం సినిమాను మాత్రం సెటిల్ చేస్తున్నాడు ప‌వ‌న్. ఇది ఆగిపోయింది. మొత్తానికి ప‌వ‌న్ ఇక రాజ‌కీయ నాయ‌కుడిగా మారిపోతున్నాడు.. ఈయ‌న నుంచి సినిమాలు ఊహించ‌డం క‌ష్ట‌మే..!

User Comments