ఎన్టీఆర్ టైమ్ వేస్ట్ చేస్తోన్న పవన్ కళ్యాణ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడూ అనుకున్న సమయానికి వచ్చేస్తుంటాయనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

అలాగే ఎన్టీఆర్ షూటింగ్ ఆలస్యం చేయడని, స్పీడ్ గా షూట్ చేస్తారని, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే 100% న్యాయం చేస్తాడనే పేరుంది.

 ఈ విషయం ఇండస్ట్రీలో కూడా అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఏ దర్శకుడైనా వెనుకాడడు అంటూ ఉంటారు.

ఇకపోతే, ప్రస్తుతం ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న తన లేటెస్ట్ మూవీ జైలవకుశ ను కూడా అంతే వేగంగా కంప్లీట్ చేశాడు.

దాంతో సినిమా సెప్టెంబర్ 21 న విడుదలకు సిద్ధం అవుతున్నది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికావడానికి మరో మూడు నెలలు పడుతుంది. షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

పవన్ రాజకీయాలతో పాటు పలు కార్యక్రమాలతో బిజీ దృష్ట్యా ఈ సినిమా ఆలస్యం అవుతోంది. ఇటువైపు, మరో పది రోజుల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ కూడా పూర్తవుతుందని అంటున్నారు. మరి జై లవకుశ సినిమా విడుదల తరువాత ఎన్టీఆర్ ఏం చేయాలనే దానిపైనే ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి.

దీంతో తారక్ ఇప్పుడు ఖాళీ గా ఉంటాడా? లేక వేగేశ్న సతీష్ తో దిల్ రాజు ప్రొడక్షన్ లో శ్రీనివాస కళ్యాణం చేస్తాడా? అంటూ తెగ చర్చించేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేద్దామని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఇలా అడ్డు పడ్డాడు ఏంటి అని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారని కొన్ని మీడియా సర్కిల్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అలాగే తారక్ కూడా ఇప్పుడు ఇదే విషయమై కొంచెం ఫీల్ అవుతున్నాడని అంటున్నారు. మరి నిజంగానే పవన్ వల్ల ఎన్టీఆర్ ఖాళీగా ఉంటాడా? అంటే.. ఉండాల్సిందేనేమో అనిపించడం ఖాయం.

Follow US