ఇంక ప‌వ‌న్ తో రుణం తీరిపోయిన‌ట్లే..!

Last Updated on by

అవును మ‌రి ఇక ఈయ‌న‌తో ప్రేక్ష‌కుల‌కు సినిమా రుణం తీరిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది. చూస్తుంటే ఇక సినిమాల‌ను త‌న దృష్టిలోకి కూడా రానిచ్చేలా లేడు ప‌వ‌ర్ స్టార్. ఇక‌పై పూర్తిగా ఈయ‌న జ‌న‌సేనానిలా మారిపోతున్నాడు. దీనికి త‌గ్గ‌ట్లుగానే వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌ట్నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాజాగా ఈయ‌న పోరాట యాత్ర కూడా మొద‌లు పెట్టాడు. శ్రీ‌కాకుళం నుంచే ఇది మొద‌లైంది. 2019లో ఏపీలో రాబోయేది జ‌న‌సేన అని ధీమాగా చెబుతున్నాడు ప‌వ‌ర్ స్టార్. దానికోసం యువ‌త మాత్ర‌మే కాదు.. పెద్దలు కూడా త‌మ‌కు ఆశీస్సులు ఇవ్వాల‌ని కోరుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఓట్ల కోసం కాదు కేవ‌లం ప్రజా సమస్యలపై అవగాహన కోసమే ఈ పోరాట యాత్ర చేస్తున్న‌ట్లు చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మన సంస్కృతిని కాపాడే పార్టీ అని.. మిగతా పార్టీల మాదిరిగా కులాలను విడదీయడం జ‌న‌సేన‌ పార్టీ సంస్కృతి కాదన్నారు ప‌వ‌ర్ స్టార్.

ప్ర‌జా స‌మ‌స్య‌లు ఎక్క‌డున్నా కూడా అక్క‌డ జ‌న‌సేన ఉంటుంద‌ని గుర్తు చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. గ‌తంలో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా.. అది అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. ఇక శ్రీకాకుళంలో వలసలు నియంత్రించే బాధ్యతను తాను తీసుకుంటానని.. ఇక్క‌డికి తాను హామీలు ఇవ్వడానికి రాలేదని.. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే యాత్ర మొద‌లుపెట్టిన‌ట్లు తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ముందు నుంచి చెబుతున్న‌ట్లుగానే శ్రీకాకుళం జిల్లా నుంచే పోరాట యాత్ర ప్రారంభించాడు ప‌వ‌న్. కపస కుర్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు కూడా నిర్వ‌హించాడు జన‌సేనాని. అక్క‌డ్నుంచి వెళ్లి మే 20 మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగసభలో పవన్ క‌ళ్యాణ్ ప్ర‌సంగిస్తారు. అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగుతుంది. మొత్తానికి ఈయ‌న తీరు చూస్తుంటే ఇక‌పై పూర్తిగా రాజ‌కీయాల్లోనే ఉండేలా క‌నిపిస్తున్నాడు. మ‌రి అప్పుడు అన్న‌య్య మిస్ అయిన ల‌క్ష్యాల‌ను ఇప్పుడు త‌మ్ముడైనా పూర్తి చేస్తాడా..?

User Comments