ఒక్కసారిగా హాట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ కొడుకు 

Pawan Kalyans son Akira Nandan shocking height

టాలీవుడ్ లోనే కాకుండా ఏ వుడ్ లోనైనా స్టార్ హీరోల పిల్లలు అంటే మీడియా ఫోకస్, జనాల ఇంట్రెస్ట్ వాళ్ళ మీదే ఉంటుందనే విషయం తెలిసిందే. అందులోనూ వాళ్ళు టీనేజ్ లో వున్నారంటే చాలు వాళ్ళ పర్సనల్ విషయాలతో పాటు సినీ అరంగేట్రానికి సంబంధించిన వార్తలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా వినిపిస్తాయి. మరి అలాంటప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్ హీరో కొడుకు అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు. అయితే, పవన్ పిల్లలు ఏ హడావుడీ లేకుండా పూణేలో రేణుదేశాయ్ దగ్గర పెరుగుతుండటంతో కొంచెం వార్తల్లో తక్కువనే అనాలి. అడపాదడపా అప్పుడప్పుడు మెరవడమే తప్ప మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవ్వలేదు.
కానీ, తాజాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ హాట్ టాపిక్ అయిపోయి అందరి దృష్టిలో పడటం గురించి ఇప్పుడు చెప్పుకుని తీరాలి. ఆ స్టోరీలోకి వెళితే, పవన్ కళ్యాణ్ తాజాగా ఎయిర్ పోర్టులో నడిచొస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. ఆ ఫోటోలో పవన్ వెనుకే ఓ పొడవాటి కుర్రాడు పవన్ కంటే ఒక అర అడుగు ఎత్తులో కనిపించి ఒక్కసారిగా అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. ఎందుకంటే, ఆ కుర్రాడు పవన్ కొడుకు అకీరానంద్ కాబట్టి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అకీరాను చిన్న పిల్లాడిగా చూసిన జనాలు ఒక్కసారిగా అంత పొడుగ్గా చూసి ఆశ్చర్యపోయి ఇంతగా ఎప్పుడు ఎదిగిపోయాడా అంటూ ఆ ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ కు ప్రభాస్, రానా, వరుణ్ తేజ్ ల తర్వాత మళ్ళీ అలాంటి ఆజానుబాహుడు హీరోగా దొరికేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే పవన్ ను మించిపోయిన అకీరానందన్ ను ఇప్పుడు లిటిల్ పవర్ స్టార్ నుంచి యంగ్ పవర్ స్టార్ గా మార్చే ప్రయత్నం చేస్తుండటం విశేషం