ప‌వ‌న్ – పూరి… దేశ‌భ‌క్తి

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ గురించి చ‌ర్చ మొద‌లైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ అది. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ క‌లిసి రెండు చిత్రాలు చేశారు. బ‌ద్రి, కెమెరామెన్ గంగ‌తో రాంబాబు త‌ర్వాత ముచ్చ‌ట‌గా మూడో సినిమాకి రంగం సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఈసారి పూరి దేశ‌భ‌క్తితో కూడిన ఓ క‌థ‌ని సిద్ధం చేశార‌ట‌.

ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌కి త‌గ్గ క‌థ అని స‌మాచారం. దాన్ని ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా విన్నార‌ని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్టు కుదిరితే వ‌చ్చే యేడాది ఈ కాంబోలో సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. ప‌వ‌న్ ఇప్ప‌టికే మూడు చిత్రాల‌కి ఓకే చెప్పేశారు. కొత్త‌గా మ‌రో రెండు చిత్రాల‌కి ఓకే చెప్పే ప‌నిలో ఉన్నారు. వాటిలో పూరి క‌థ ఉన్న‌ట్టు స‌మాచారం. పూరి కూడా ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `ఫైట‌ర్‌` సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఆ చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ సినిమాకోస‌మే రంగంలోకి దిగుతాడ‌ట పూరి.