బాల‌య్య క‌ర్ణ అయితే ప‌వ‌న్ అజ్ఞాత‌వాసే..

ఈ రోజుల్లో క‌థ‌లు రాయడం ఈజీనే కానీ.. దానికి త‌గ్గ టైటిల్ పెట్ట‌డం మాత్రం క‌ష్టంగా మారింది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు. కొన్ని సినిమాల‌కు ఏదో ల‌క్ తో మొద‌ట్లోనే అద్భుత‌మైన టైటిల్స్ ప‌డుతుంటాయి. కానీ కొన్నింటికి మాత్రం షూటింగ్ పూర్తి కావొస్తున్నా టైటిల్ మాత్రం దొర‌క‌దు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమా రెండో లిస్ట్ లో ఉంది. ఈ చిత్రానికి ఇప్ప‌టికే చాలా టైటిల్స్ అనుకున్నారు. కానీ ఏదీ ఫైన‌ల్ కాలేదు. పైగా ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ సినిమా కావ‌డంతో త్రివిక్ర‌మ్ మ‌రింత జాగ్ర‌త్త తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా క‌నిపిస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. దానికి తోడు ప‌ర్ ఫెక్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ గా.. ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య న‌లిగే కొంటె కృష్ణుడిగా.. ఇలా ఒక్క సినిమాలో కావాల్సినన్ని వేరియేష‌న్స్ ప్లాన్ చేసాడు త్రివిక్ర‌మ్. ఈ సినిమాకు దేవుడే దిగివ‌చ్చినా.. ఇంజ‌నీరింగ్ బాబు.. ఇంజ‌నీర్ అల్లుడు.. గోకుల కృష్ణుడు.. రాజు వ‌చ్చినాడో లాంటి చాలా టైటిల్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కానీ ఇప్పుడు అజ్ఞాత‌వాసి క‌న్ఫ‌ర్మ్ అయిపోయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ టైటిల్ ను నిర్మాత రాధాకృష్ణ ఛాంబ‌ర్ లో రిజిష్ట‌ర్ చేయించారు కూడా.

ఇక బాల‌య్య సినిమాకు కూడా ఇదే తిప్ప‌లు. పైసావసూల్ టైమ్ లో కూడా చాలా టైటిల్స్ అనుకుని చివ‌రికి పైసావ‌సూల్ ద‌గ్గ‌ర ఆగాడు బాల‌య్య. ఇప్పుడు ఆయ‌న కేఎస్ ర‌వికుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి క‌ర్ణ అనే టైటిల్ అనుకుంటున్నారు. అనుకోవ‌డం కాదు.. ఇదే క‌న్ఫ‌ర్మ్ అనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ టైటిల్ ను ఇప్ప‌టికే సి క‌ళ్యాణ్ రిజిష్ట‌ర్ చేయించాడు. అయితే క‌ర్ణ అనే టైటిల్ మ‌రొక‌రితో ఉండ‌టంతో దీనికి ఎన్ బికే క‌ర్ణ అని యాడ్ చేయ‌నున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. న‌య‌న‌తార హీరోయిన్. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి ఇటు క‌ర్ణ‌.. అటు అజ్ఞాత‌వాసి టైటిల్స్ ఫ్యాన్స్ ను ఫుల్ గా ఖుషీ చేయిస్తున్నాయి.