పవన్ సారూ – పంద్రాగస్టుకు షురూ..!

పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ అటు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. సినిమా పూర్తి చేశాక.. మరో సినిమా చేయాలి అనుకున్నా.. సినిమా ఆలస్యం అయ్యే విధంగా ఉంది. ఇక అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో బిజీగా ఉండాలని అనుకుంటున్నారు.2019 లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల సమయానికి పవన్ పార్టీని సిద్ధం చేసి పోటీ చేయాలన్నది పవన్ ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే, పవన్ త్రివిక్రమ్ సినిమా గురించిన ఏ విషయాలు ఇప్పుడు బయటకు రావడం లేదు. కాటమరాయుడు సినిమా విడుదల తరువాత పవన్ కళ్యాణ్ వెంటనే త్రివిక్రమ్ కు రెడీ అయ్యారు. సినిమా ఓపెనింగ్ జరుపుకుంది. కొన్ని రోజులపాటు షూటింగ్ కూడా చేశారు. ఎందుకో తెలియదు సినిమా స్లో అయింది. ఎన్ని రోజుల షూటింగ్ జరిగింది అనే విషయం తెలియదు.

సినిమా టైటిల్ గురించిన విషయాలు బయటకు రాలేదు. ఇంజినీర్ బాబు అని, గోపాల కృష్ణుడు అని, పరదేశి ప్రయాణం అని టైటిల్స్ బయటకు వచ్చాయి. ఇవన్నీ ఫ్యాన్ మెడెడ్ టైటిల్స్. వీటిలో దేనిని ఇంతవరకు కంఫర్మ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు షూటింగ్ స్టార్ట్ చేసుకున్న బాలకృష్ణ.. పూరి సినిమా వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. అలాగే, ఎన్టీఆర్ జైలవకుశ కూడా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కూడా దసరాకు వస్తుంది. అయితే, పవన్ సినిమా సంక్రాంత్రికి తీసుకురావాలి అనుకుంటున్నారు కాబట్టి.. సినిమాను నిదానంగా షూట్ చెయ్యొచ్చు అనుకున్నారు. అయితే, టైటిల్ విషయం ఇంతవరకు బయటకు రాకపోవడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలను పక్కన పెడుతూ.. ఆగష్టు 15 న పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారట. ఆరోజే టైటిల్ అనూన్స్ మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు.