పవన్ Vs శ్రుతిహాసన్… ఏమిటీ గొడవ??

శ్రుతిహాసన్ కెరీర్ మలుపు తిరగడానికి కారణం నూటికి నూరు శాతం గబ్బర్ సింగ్ సినిమానే. ఆ హిట్టు లేకపోతే… శ్రుతి కెరీర్ ఏమైపోయేదో. అప్పటి వరకూ ఐరెన్ లెగ్ అనిపించుకొన్న శ్రుతి.. గబ్బర్ సింగ్‌తో గోల్డెన్ లెగ్ అయిపోయింది. అందుకే గబ్బర్‌సింగ్ సినిమా నాకు ప్రత్యేకం.. పవన్ కల్యాణ్ ఇంకా ప్రత్యేకంగా అని చాలా సందర్భాల్లో చెప్పుకొంది. పవన్‌తో మరోసారి కలసి నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. ఈమధ్య శ్రుతి కెరీర్ చాలా డల్ గా నడుస్తోంది. పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది. కాటమరాయుడుతో మళ్లీ తన జాతకం తిరగబడుతుందని భావించింది. అయితే కాటమరాయుడు సినిమాసెట్లో శ్రుతికీ, పవన్‌కీ మధ్య గొడవైందని, శ్రుతికి పవన్ క్లాస్ పీకాడన్న ప్రచారం జోరుగా సాగింది. దానికి బలం చేకూరుస్తూ ఆడియో ఫంక్షన్‌కి డుమ్మా కొట్టేసింది శ్రుతి. ఇక ముందు కూడా కాటమరాయుడు ప్రమోషన్లలో శ్రుతి కనిపించదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలింతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగిందన్నది ప్రస్తుతం టాలీవుడ్ ని కుదిపేస్తున్న ప్రశ్న. కాటమరాయుడు సెట్స్‌కి శ్రుతి చాలా ఆలస్యంగా వచ్చేదని, పవన్ ఒకట్రెండు సార్లు వదిలేసినా.. మూడోసారి గట్టిగా నిలదీశాడని, ఓ రోజు సెట్లో అందరు ఉండగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడని టాక్ వినిపిస్తోంది. దాంతో శ్రుతి కూడా అలిగిందట. ఆ క్షణం నుంచీ పవన్, శ్రుతీ అంటీ ముట్టనట్టుగానే ఉన్నారని, తన కాల్షీట్లు అయిపోయిన తరవాత.. శ్రుతి ఎవ్వరికీ టచ్‌లో లేకుండా పోయిందని, కాటమరాయుడు ఫంక్షన్‌కీ డుమ్మా కొట్టడానికి కారణం అదేనని తెలుస్తోంది.