సంపత్ నంది విషయంలో పవన్ గెలిచాడు..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో వదులుకున్న కొన్ని క్రేజీ ప్రాజెక్టులు వేరే హీరోల చేతుల్లో పడి బ్లాక్ బాస్టర్స్ గా నిలిచి, వారికి స్టార్ హీరో స్టేటస్ తెచ్చిపెట్టేలా చేశాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న విషయమే.

అయితే, ఇప్పుడు మాత్రం పవన్ వదులుకున్న రెండు ప్రాజెక్టులు అంతగా సక్సెస్ కాకపోవడంతో.. పవన్ జడ్జిమెంట్ ఈసారి నిజమైందని ప్రస్తుతం వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

అసలు విషయంలోకి వెళితే, డైరెక్టర్ సంపత్ నంది రెండేళ్ల పాటు ఎదురుచూసి కూడా పవన్ తో సినిమా చేయాల్సిన ఛాన్స్ ను చేజేతులా వదులుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మొదట ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కి డైరెక్షన్ చేయడం కోసం వెళ్లిన సంపత్ నందిని తన కథలు ఏమైనా ఉంటే చెప్పమని పవన్ కోరినట్లు సమాచారం.

దీంతో తన దగ్గరున్న రెండు కథలను సంపత్ నంది చెబితే వాటిని పవన్ రిజెక్ట్ చేశాడట.

ఇక ఆ తర్వాత పవన్ తన కథనే ఇచ్చి డెవలప్ చేయమని చెబితే అది కూడా తనకు నచ్చినట్లు చేయకపోవడంతో సంపత్ నందిని తప్పించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు పవన్ కు చెప్పి మెప్పించలేకపోయిన రెండు కథలను సంపత్ నంది సినిమాలుగా మలిచేయడంతో.. పవన్ జడ్జిమెంట్ పై అప్పుడే చర్చలు మొదలైపోయాయి.

ఇక ఆ రెండు సినిమాలూ రవితేజతో తీసిన బెంగాల్ టైగర్, గోపీచంద్ తో తీసిన గౌతమ్ నంద కావడంతో.. వాటి ఫలితాలపై సినీవర్గాలు ఓ అంచనాకు వచ్చేస్తున్నాయి.

అందులో మొదట బెంగాల్ టైగర్ సినిమా యావరేజ్ గా నిలవగా.

 ఈ వీకెండ్ లోనే రిలీజైన గోపీచంద్ గౌతమ్ నంద కూడా ఆశించినంత గొప్పగా లేదనే టాక్ తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఈ కారణంగా ఇప్పుడు ఈ సినిమాలను పవన్ చేసున్నా కూడా కలెక్షన్స్ వస్తాయి గాని, పవన్ రేంజ్ కు తగ్గ సినిమాలు కావనే టాక్ ను తెచ్చుకునేవని జోస్యం చెప్పేస్తున్నారు.

దీంతో చాలా సినిమాలను వదిలేసుకొని బ్లాక్ బాస్టర్స్ మిస్ చేసుకున్న పవన్ ఈసారి సంపత్ నంది విషయంలో మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నాడని అంటున్నారు.

ఈ లెక్కన పవన్ మాట ఈసారికి నెగ్గిందని, ఈ విషయంలో మొత్తానికి పవన్ గెలిచాడని చెప్పుకుంటున్నారు.

Follow US