బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ `సీత‌` చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ స్పెష‌ల్ సాంగ్‌

Last Updated on by

`RX 100` చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న `సీత‌` చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించారు. సినిమా క‌థానుసారం కీల‌క స‌మ‌యంలో.. `బుల్ రెడ్డి… ` అంటూ సాగే ఈ స్పెష‌ల్ పెప్పీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సాంగ్ రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు విడుద‌లవుతుంది. ఈ సాంగ్‌లో పాయ‌ల్ సో లో పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిల‌వ‌నుంది.

సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ 2.5 మిలియ‌న్ వ్యూస్‌తో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్‌గా ట్రేడ్ వ‌ర్గాల్లో బిజినెస్ డీల్స్ కూడా పూర్త‌య్యాయి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు:

బెల్లంకొండ శ్రీనివాస్‌

కాజ‌ల్ అగ‌ర్వాల్‌

మ‌న్నారా చోప్రా

సోనూ సూద్‌

త‌నికెళ్ల భ‌ర‌ణి

అభిన‌వ్ గోమ‌టం

అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శక‌త్వం: తేజ‌

నిర్మాత‌: రామబ్ర‌హ్మం సుంక‌ర‌

బ్యాన‌ర్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

స‌మ‌ర్ప‌ణ‌: ఏ టీవీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గరిక‌పాటి

కో ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌

మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌

సినిమాటోగ్ర‌పీ: శిర్షా రే

ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌

డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌

ప‌బ్లిసిటీ ఇన్‌చార్జ్‌: విశ్వ సి.ఎం

పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌

User Comments